శ్రీకాంత్.. లవ్ స్టోరీ వింటే ఫిదా అవ్వాల్సిందే..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందిన శ్రీకాంత్ తాజాగా అఖండ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో వరదరాజులు పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. తన సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న శ్రీకాంత్ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ.. ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అంతే కాదు తన భార్య ఊహకు ఎలా ప్రపోజ్ చేశాడు అనే విషయాన్ని కూడా వెల్లడించాడు..

Srikanth's daughter to make on-screen debut in Telugu
శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఊహా నటించిన మొదటి సినిమా లో నేను కూడా హీరోనే.. ఆ తర్వాత నాలుగు సినిమాలు కలిసి చేశామని ఆయన తెలిపారు.. మొదటి నుంచి ఊహను ప్రేమించిన నేను ఆమెతో చెప్పుకోలేక డైరెక్ట్ గా మద్రాస్లో ఉన్న ఊహ ఇంటికి వెళ్లి బంగారు గొలుసు కొనుక్కొని మరీ.. దేవుని మందిరంలో ఊహ, ఊహ పేరెంట్స్ ను పిలిచి ఊహ కు ప్రపోజ్ చేశాను అని శ్రీకాంత్ తెలిపాడు. ఇక ఊహ అసలు పేరు ఉమామహేశ్వరి.. ఇక తమిళంలో శివరంజని అని పిలుస్తారు.. ఇక్కడ ఊహా అని పేరు పెట్టారని శ్రీకాంత్ తెలిపారు. ఊహను మేమంతా ఉమా అని పిలుస్తామని, ఊహకు నేనంటే ఇష్టం కావడంతో అలా మా ప్రయాణం మొదలైంది అని ఆయన వెల్లడించారు.

Share.