‘రాజావారు రాణిగారు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఆ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన నటించిన ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ ఫిల్మ్ థియేటర్స్‌లో విడుదలై హిట్ టాక్ తెచ్చేసుకుంది. శ్రీధర్ గాదె డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో కిరణ్‌కు జోడీగా బ్యూటిఫుల్ ప్రియాంక జవాల్కర్ నటించింది. ప్రమోద్, రాజు ఈ చిత్రాన్ని నిర్మించగా, చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందించారు. ఇకపోతే ఈ చిత్రం యూత్‌ను బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సీరియర్ హీరో సాయి కుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు.
ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ కాగా, త్వరలో ఓటీటీలో స్ట్రీమ్ కాబోతున్నది. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో విడుదల కాబోతుండగా, తేదీ ఎప్పుడు? అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ విషయమై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నారు. ఈ నెల 27వ తేదీన ఈ చిత్రం ‘ఆహా’లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.