ఆమె కాళ్లకు దండం పెడతానంటున్న ఎస్పీ బాలు !

Google+ Pinterest LinkedIn Tumblr +

‘ఓ చెలియా నా ప్రియ సఖియా..’ అంటూ గొంతు సవరించి సోషల్ మీడియాలో గత కొన్నిరోజులుగా వైరల్ అవుతున్న మట్టిలో మాణిక్యం, పల్లెకోకిల బేబీ మరోసారి తన పాటతో కోట్లాది హృదయాలను కదిలించింది. ఆ పేద కూలీని గాన కోకిలగా మార్చేందుకు తలో చేయి వేస్తున్నారు. ఆమె గాత్రానికి అంతా మంత్రం ముగ్ధులు అవుతున్నారు. ఆమె పక్క పల్లెటూరు నుంచి వచ్చినా… ఆమె ఇప్పుడు పెద్ద సెలెబ్రెటీ గా మారిపోయింది.

అనుకోకుండా వచ్చిన ఈ సెలెబ్రెటీ స్టేటస్ తో ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంతో ఆమెతో సినిమాల్లో పాటలు పాడించేందుకు సంగీత దర్శకులు క్యూ కడుతున్నారు. తాజాగా సింగర్ బేబీని గాన గంధర్వుడుగా పిలుచుకునే బాల సుబ్రహ్మణ్యం ప్రశంసించారు. ఆమెను తన పాడుతా తీయగా ప్రోగ్రామ్‌కు అతిథిగా ఆహ్వానించి ఆమెతో పాట పాడించారు. ఆమె పాట పూర్తికాగానే బాలు లేచి చప్పట్లతో ఆమెను అభినందించారు.

పాడుతా తీయగా కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు కూడా బేబీ పాట పూర్తికాగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఆ సందర్భంగా బాల సుబ్రహ్మణ్యం సింగర్ బేబీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఒక పాట వీడియోకు కొన్ని లక్షల లైకులు, వ్యూలు రావడం సంగీత స్రష్టలకే కష్ట సాధ్యంగా ఉంటుందని అలాంటిది బేబీ పాటకు లక్షల్లో లైకులు రావడం చెప్పుకోదగిన గుర్తింపుగా బాలు చెప్పుకొచ్చారు.

మొదట్లో సింగర్ బేబీ గురించిన పాట వీడియో తన వద్దకు వచ్చినప్పుడు త్వరగా చూడలేకపోయానని.. కానీ ఆ తర్వాత చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. ఒక పల్లెటూరి రైతుకూలీ ఇంత శ్రుతిపరంగా పాడటం చాలా అరుదని మెచ్చుకున్నారు. అందుకే పాడుతా తీయగాకు పిలిచి గౌరవించుకుంటున్నామని అన్నారు.ఇంత మంచి మట్టిలో మాణిక్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన అమ్మాయి కాళ్లకు సంగీత ప్రపంచమంతా దండం పెట్టుకోవాలని ఎస్పీ బాలు అన్నారు.

Share.