సౌందర్య మహేష్ బాబుతో నటించకపోవడానికి కారణం..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీలో కృష్ణ వారసత్వంగా మహేష్ బాబు ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి మనకు తెలిసిందే.. మొట్టమొదటిగా రాజకుమారుడు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటివరకు పలు సినిమాల్లో నటించి తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పరచుకున్నాడు. అయితే ఈ మధ్యనే గుంటూరు కారం చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈచిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లో విడుదల కానుంది. ఇది కాస్త పక్కన పెడితే తాజాగా మహేష్ బాబు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

మహేష్ బాబు సౌందర్య హీరో హీరోయిన్స్ గా మిస్ అయినా సినిమా ఏంటో తెలుసా - How  Yamaleela Missed For Mahesh Babu And Soundarya

ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్ సౌందర్య ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పటి స్టార్ హీరోలు అందరితోనూ దాదాపు 100 సినిమాలకు పైగా నటించింది. అయితే సౌందర్య తో నటించే ఛాన్స్ మహేష్ బాబు మిస్ అయినట్టు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్లో రావాల్సిన మూవీలో మరో హీరోయిన్ నటించింది.

రాజకుమారుడు చిత్రం తరువాత యువరాజు చిత్రంలో కూడా నటించాడు. ఇందులో ప్రిన్స్ మహేష్ బాబు పక్కన సిమ్రాన్, సాక్షి శివానంద్ హీరోయిన్ గా కనిపించారు. అయితే ఈ చిత్రంలో ముందుగా సిమ్రాన్ కాకుండా సౌందర్యం ఎంపిక చేశారట డైరెక్టర్.. కానీ సౌందర్య మహేష్ బాబు కంటే వయసులో పెద్ద కావడంతో వీరిద్దరి కెమిస్ట్రీ అంతగా వర్కౌట్ కాలేదట. ఎటు నుంచి చూసిన మహేష్ బాబు కి అక్కలా కనిపిస్తోందట సౌందర్య.. ఈ విషయాన్ని సౌందర్యనే డైరెక్టర్ వైవిఎస్ చౌదరికి చెప్పిందట.

ఈ పాత్రకి నాకంటే సిమ్రాన్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని సౌందర్య అనటంతో డైరెక్టర్ సిమ్రాన్ ని ఎంపిక చేశారట. అలా మహేష్ బాబు సౌందర్య జోడి వెండితెరపై చూడలేక పోయారు. ఒకవేళ తెలుగు ఇండస్ట్రీలో వీరిద్దరి జోడి సరిపోయి ఉంటే వీరిద్దరి కాంబినేషన్లో పలు సినిమాలు వచ్చేవని చాలామంది అనుకుంటున్నారు.

Share.