టాలీవుడ్ ప్రేక్షకులకు ఒకప్పటి తెలుగు హీరోయిన్ సౌందర్య అందరికీ సుపరిచితమే. ఇక ఇమే ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరును సంపాదించుకున్నది .సౌందర్య అందం, నటన మాట్లాడే విధానం ఆమెకు అంత పెద్ద పేరును తెచ్చిపెట్టాయి. కానీ ఆమె దురదృష్టవశాత్తు అభిమానులకు దూరమైంది. ఇక ఆమె దూరమై కొన్నేళ్లు అవుతున్న ఆమె అభిమానులు మాత్రం తన జ్ఞాపకాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సినిమాలలో అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపిస్తూ ఉంటుంది.
నేటితరం హీరోయిన్లకు సౌందర్య ఒక రోల్ మోడల్ అని చెప్పవచ్చు. తను అప్పట్లో అగ్ర హీరోల సరసన నటించి ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. అంతేకాకుండా సౌందర్య డేట్స్ కోసం దర్శక నిర్మాతలు ఎదురు చూసేవారట. మరి అప్పట్లో ఆమెకు అంత క్రేజ్ అంతలా ఉండేది. సౌందర్య ఎంతోమంది హీరోలతో నటించినప్పటికీ ఒక హీరోతో మాత్రం నటించటానికి ఇష్టపడలేదట. అంతేకాకుండా సదరు హీరోతో నటించను అనే విషయాన్ని డైరెక్టర్ మొహం మీద చెప్పేసిందట.
ఇంతకు ఆ హీరో ఎవరో కాదు కమెడియన్ ఆలీ ఈయన హీరోగా పలు సినిమాల్లో నటించి గొప్ప పేరును తెచ్చుకున్న వ్యక్తి. అంతేకాకుండా కమెడియన్ గా కూడా స్టార్ పొజిషన్లో ఉన్నాడు. ఇక సౌందర్య రిజెక్ట్ చేసిన సినిమా యమలీల అందులో ఆలీ సరసన నటించాల్సి ఉంది..సౌందర్య అయితే ఆ సినిమా కథని విని తరువాత సౌందర్య హీరో ఎవరు అని అడగ్గా అలీ అని చెప్పటంతో వెంటనే సౌందర్య నేను చెయ్యను అని ముఖం మీద చెప్పేసిందట. అలా చెప్పటంతో సౌందర్యకు బదులు ఇంద్రజను హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారు.
అంతేకాకుండా ఇంద్రజకు కూడా ఈ సినిమా మంచి పేరును తెచ్చి పెట్టింది. అప్పట్లోనే విడుదలైన ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికి తెలిసిందే ..ఇక ఆలీ చైల్డ్ యాక్టర్ గానే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.