తెలుగు రాష్ట్రాలలో జబర్దస్త్ ,శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు ఎంతటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో వాళ్ళు సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారు అందరూ కలిసి కామెడీ డాన్సర్లతో అదరగొట్టేస్తూ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు. ఇటీవలే జబర్దస్త్ లోకి కొత్త యాంకర్ వచ్చిన సౌమ్యా రావు అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
వచ్చిరాని తెలుగుతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది సౌమ్య రావు. ఇక హైపర్ ఆది పైన కూడా రివర్స్ పంచులు వేసి మంచి పాపులారిటీ అందుకుంది. దీంతో హైపర్ ఆదికి తగ్గట్టుగానే ఉంది అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పటికీ ఎన్నోసార్లు సౌమ్యరావు, హైపర్ ఆది రివర్స్ పంచులు వేస్తూ సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరొకసారి స్టేజి పైన హైపర్ ఆది పరువు తీసేసింది సౌమ్యరావు.
హోలీ పండుగ సందర్భంగా గుండెజారి గల్లంతయ్యిందని ఒక కొత్త ఈవెంట్ ని ప్లాన్ చేశారు ఈటీవీ వారు.అందుకు సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేయడం జరిగింది. హోలీ పండుగ ఈవెంట్ కి సీనియర్ నటి శ్రీదేవి గెస్ట్ గా హాజరయ్యింది. ఈ ప్రోమోలో డాన్సులు కామెడీలతో చాలా సరదా సరదాగా సాగిపోయింది. ఈ నేపథ్యంలోనే సౌమ్యరావు స్టేజి పైన హైపర్ ఆదిని మరొకసారి ఆడుకోవడం హైలైట్ గా నిలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారుతోంది. ఇందులో హైపర్ ఆది పై చాలా సెటైర్లు వేసినట్లుగా తెలుస్తోంది.