చైతుతో పెళ్లి పై గట్టి కౌంటర్ వేసిన శోభితా ధూళిపాళ్ల..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జున ఫ్యామిలీకి ఎంత ఇమేజ్ ఉందో చెప్పనవసరం లేదు..ఆ ఇంటి వారసుడిగా నాగచైతన్యz అఖిల్ కి అంతే ఇమేజ్ ఉంది. అయితే ఈమధ్య నాగచైతన్య తన జీవితంలో రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తల్లో నిలిచాడు.. ఆ వార్త విన్నప్పటి నుంచి ఆయన అభిమానులు ఆయన పెళ్లి గురించి ఈ వార్తలు నిజమా లేదా అంటూ సోషల్ మీడియాలో రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. అయితే అతను ఇప్పటికీ నటి శోభితతో కలిసి డేటింగ్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ అతను అరేంజ్డ్ మ్యారేజ్ సెట్ ప్ కి వెళ్లడం వెనుక ఎటువంటి నిజం లేదని వార్తలు వస్తున్నాయి.

Naga Chaitanya is angry over his link-up rumours with Major actress Shobita  Dhulipala [Report]

మొన్నటికి మొన్న నాగచైతన్య తండ్రి నాగార్జున తన కొడుకు రెండో వివాహం గురించి ప్లాన్ చేశానని పెళ్లి పై క్లారిటీ వచ్చేవరకు అమ్మాయి గుర్తింపును తెలియకుండా ఉంచుతాడని ఒక నివేదిక పేర్కొంది. అంతేకాకుండా నాగచైతన్య పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఒక వ్యాపారి కుటుంబానికి చెందిన అమ్మాయి అని కూడా వెల్లడించారు.

నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల రిలేషన్షిప్ గురించి గత ఏడాది నుంచి రూమర్స్ మొదలైన సంగతి మనకు తెలిసిందే.. వీరిద్దరి ఫోటోలు ఎప్పటికప్పుడు ఇంటర్నెట్లో ప్రత్యక్షం అవుతుండడం ఈ వార్తలకు ఇంకాస్త బలం చేకూరిందనే చెప్పొచ్చు. ఈ ఏడాది మార్చిలో చెఫ్ సురేందర్ మోహన్ నాగచైతన్యతో కలిసి ఉన్న ఓ ఫోటోను ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో టేబుల్ వద్ద కూర్చున్న శోభిత ధూళిపాళ్లను అభిమానులు వెంటనే గుర్తించేశారు.

మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా రిలేషన్ షిప్ పుకార్లను ప్రస్తావిస్తూ శోభిత ధూళిపాల మాట్లాడుతూ నామీద వచ్చే పుకార్లను అలాగే నా మీద వేసే నిందలను అలాంటి వాటిని నేను పట్టించుకోము అంతేకాకుండా వాటికి సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదని ఆమె చెప్పేసింది. నేను ఏ తప్పు చేయలేనప్పుడు నేనెందుకు అలాంటి విషయాలు పట్టించుకోవాలి. అంటూ ఘాటుగా సమాధానాలు ఇచ్చింది. దీంతో ఈ రూమర్లకు చెక్ పడుతుందేమో చూడాలి మరి.

Share.