ప్రస్తుతం నటుడు నందమూరి తారకరత్న హార్ట్ ఎటాక్ రావడంతో బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తారకరత్న నారా లోకేష్ ప్రారంభించిన యువగలం పేరుతో పాదయాత్రలో కాసేపు నడిచిన తర్వాత తీవ్ర అస్వస్థకు గురి కావడంతో తారకరత్న ని కుప్పం ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం అదే రోజు రాత్రి మెరుగైన వైద్యం కోసం బెంగళూరులో నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి పైన వైద్యులు విడుదల చేస్తూ ఉన్నారు.
అయితే ఈ సమయంలోనే తారకరత్న గురించి తెలుసుకోవడానికి అభిమానులు, నేటిజన్లు తెగ వెతికేస్తున్నారు.ఈ క్రమంలోనే తారకరత్న సినిమాలు కుటుంబం గురించి ఎంక్వయిరీ చేయడం జరిగింది. తారకరత్న భార్య పేరు అలేఖ్య రెడ్డి.. పెద్దలను ఎదిరించి మరి వివాహం చేసుకున్నారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అలేఖ్య రెడ్డి తన లవ్ స్టోరీ గురించి తెలియజేశారు. తారకరత్న చెన్నైలో ఉన్న తన సిస్టర్ స్కూల్లో ఇమే సీనియర్ అట.. ఆ తర్వాత కామన్ ఫ్రెండ్ ద్వారా మేము హైదరాబాదులో కలిసాము వాస్తవానికి మేము మొదట మంచి ఫ్రెండ్స్ గానే ఉన్నాము..కానీ ఆ తర్వాత తారకరత్న మొదట ప్రపోజ్ చేశారని దీంతో నేను మా పేరెంట్స్ తో మాట్లాడమని సూచించానని తెలిపింది అలేఖ్య రెడ్డి.
కానీ తమ ఇంట్లో ఒప్పుకోలేదట. అందుకు కారణం సినీ ఇండస్ట్రీ పైన వారికి మంచి అభిప్రాయం లేకపోవడమే అన్నట్లుగా తెలియజేసింది. నందమూరి ఫ్యామిలీ కూడా వీరి పెళ్లికి ఒప్పుకోలేదు అందుకు కారణం అలేఖ్య రెడ్డి వివరించారు. అందుకు కారణం అప్పట్లో వివాహం చేసుకొని విడాకులు తీసుకున్నానని నేను కూడా మళ్లీ పెళ్లి చేసుకుంటానని అనుకోలేదని తెలిపింది. కానీ మా పెళ్లికి తమ అంకుల్ విజయసాయిరెడ్డి మద్దతుగా నిలిచారని 2012 ఆగస్టు 12న ఒక గుడిలో వివాహం చేసుకున్నామని తెలిపారు. ఆ తర్వాత 2013 లో ఒక పాప పుట్టిందని ఆ తరువాత నాలుగు సంవత్సరాలకు తారకరత్న బర్తడే వేడుకలలో అందరూ కలిసినట్టుగా తెలియజేసింది అలేఖ్య రెడ్డి.