తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరు పొందిన జంటలలో అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డి కూడా ఒకరు. ఇక అల్లు అర్జున్ ఒకవైపు సినిమాలలో నటిస్తూ పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించడంతో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంటోంది. ఇక అలాగే తన కూతురు కొడుకు భర్తకు సంబంధించిన విషయాలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది స్నేహ రెడ్డి.
మొదట్లో సోషల్ మీడియాకు దూరంగా ఉన్న స్నేహారెడ్డి ఈమధ్య కాలంలో గ్లామర్ షో తో కూడా రెచ్చిపోతోంది .తరచూ హాట్ ఫోటో షూట్లను సైతం షేర్ చేస్తూ హీరోయిన్లను డామినేట్ చేయడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ట్రెడిషన్ దుస్తులలో కనిపించిన స్నేహ రెడ్డి.
ఈ మధ్యకాలంలో అందాల ఆరబోత విషయంలో డోస్ కాస్త పెంచిందని చెప్పవచ్చు. దీంతో కొంతమంది ఇమెను హీరోయిన్గా ట్రై చేయవచ్చు కదా అంటు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి కొంతమంది అల్లు అర్జున్ పరువు తీస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
స్నేహ రెడ్డి ఆ రేంజ్ లో రెచ్చిపోతుంటే అల్లు అర్జున్ అతని కుటుంబ సభ్యులు కూడా ఏం మాట్లాడకపోవడానికి కారణం ఇదే అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది .అదేమిటంటే వివాహానికి ముందే ఒక కండిషన్ పెట్టిందట స్నేహ రెడ్డి..ఫ్యాషన్ డిజైనింగ్ చేయడం అన్నది స్నేహ రెడ్డి కోరికట.
అది వివాహమైన తర్వాత కూడా కంటిన్యూ చేస్తానని చెప్పిందట ..అల్లు అర్జున్ అలాగే అల్లు అరవింద్ కుటుంబం కూడా స్నేహ డ్రీమ్ కి అడ్డు రావడంలేదని సమాచారం. దీంతో స్నేహారెడ్డి లైఫ్ కి అల్లు అర్జున్ అల్లు కుటుంబం కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నట్లు తెలుస్తోంది.