మాస్ లుక్ లో సమంత .. ఫోటో వైరల్?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రష్మిక మందన అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. హీరోయిన్ సమంత పుష్పా సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అందుకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఈ స్పెషల్ కూడా త్వరలోనే విడుదల కానుంది.

ఇదే విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తూ సమంత లుక్ ని విడుదల చేసింది. లంగా జాకెట్ ధరించి మాస్ లుక్ లో బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే కనిపిస్తున్న సమంత ఫోటోలు షేర్ చేశారు చిత్రబృందం.

ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పాటలో సమంత అదిరిపోయే స్టెప్పులు వేసినట్లు సమాచారం. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ను డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు.

Share.