టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు.. నెంబర్ వన్ హీరోగా గ్యాప్ లేకుండా నటిస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడిపేస్తున్నాడు. మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఈ మధ్యనే జ్యువలరీ కి బ్యాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించింది.. ఇంత చిన్న వయసులోనే ఎంతో సేవా గుణం కలిగినటువంటి సితార ఒక వైపు చదువులోనూ మరోవైపు సినీ రంగంలోనూ కూడా ఎంతో ఆసక్తిని చూపిస్తోంది.
ఇక సితార ఇంత చిన్న వయసులోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాలో ఈ చిన్నారి ఎంతో యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది నిన్న ఇంటర్నేషనల్ సినిమా డే కావడంతో తన ఇంస్టాగ్రామ్ వేదికలో తన తల్లిదండ్రులతో పాటు సూపర్ స్టార్ కృష్ణ గారితో కలిసి ఉన్నటువంటి ఒక ఫోటోను షేర్ చేసింది.
వెండితెరపై అగ్రగామిగా నిలిచినటువంటి మా నాన్నగారికి తన తండ్రి ఎంత స్ఫూర్తిగా ఉండేవారు.. అలాగే మా నాన్న కూడా మాకు అంతే స్ఫూర్తిగా నిలిచారు. లెజెండరీ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ గారు (తాతగారు) మా అందరిపై ఈ విధమైనటువంటి ప్రభావాన్ని చూపారు ఆయన వారసత్వంలో నేను కూడా భాగమైనందుకు చాలా గర్వపడుతున్నాను. నా జీవితంలో సినిమాకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది.. సినిమా అంటే నాకు కేవలం చిత్ర పరిశ్రమ మాత్రమే కాదు సినిమానే నా డిఎన్ఏ లో ఉంది. ఇలా నా కుటుంబ చిత్ర ప్రయాణాన్ని ఇష్టపడుతూ ఆదరిచున్నటువంటి మీ అందరికీ జాతీయ సినిమా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ సితార తెలిపింది.
View this post on Instagram