ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం సీతారామం.డైరెక్టర్ హానురాగవపూడి తను తెరకెక్కించిన అందాల రాక్షసి సినిమా నుంచి ఇప్పటివరకు అన్ని ఒక విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఉంటారు. అయితే అంతటి అచ్చ తెలుగు ప్రేమ కథల్లో తెలుగు అమ్మాయిలని ఎందుకు నటించారు అనే ప్రశ్న మాత్రం వినిపిస్తూనే ఉంటుందట. ఇదే ప్రశ్న ఆయన దగ్గర వేస్తే పలు ఆసక్తికరమైన సమాధానాన్ని తెలియజేశారు. వాటి గురించి తెలుసుకుందాం.
హనురగవపుడికి పుస్తకాలు కొనడం అంటే చాలా ఇష్టమట .అలా ఒకసారి హైదరాబాదులో కోటీలో ఒక సెకండ్ హ్యాండ్ పుస్తకం కొన్నారట. అలా ఆ పుస్తకాన్ని ఓపెన్ చేయగ ఒక లెటర్ చదివాడట. హాస్టల్లో ఉంటున్న అబ్బాయికి వాళ్ళ అమ్మ రాసిన లేక అది.అందులో చూస్తే సెలవులకు ఇంటికి రమ్మని ఉందట. ఆ లెటర్ చూశాను ఒకవేళ లెటర్ లో ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉంటే అనే ఆలోచన వచ్చిందట. ఈ ఆలోచన నుండి పుట్టిందే సీతారామం చిత్రమని తెలిపారు. సీత పాత్ర కోసం వెతుకుతున్నప్పుడు అమ్మాయి కొత్తగా ఉండాలనుకున్నాము..
అప్పుడే మృణల్ ఠాగూర్ పేరునే నిర్మాత స్వప్న తెలియజేశారని తెలిపింది. ఆమెను చూడగానే సీత పాత్రకు సరిపోతుందని పించిందని తెలిపారు డైరెక్టర్. కొంతమంది తెలుగు అమ్మాయిని ఆ పాత్ర కోసం ఎందుకు తీసుకోలేదు అంటున్నారు ..అయితే తెలుగు వాళ్ళ ప్రొఫైల్ ఎక్కడ కనిపించవు ఫలానా అమ్మాయి అని తెలిస్తే తన పాత్ర సరిపోతుందా లేదా అని చూడొచ్చని క్లారిటీ ఇచ్చాడు. తనకు తగ్గ పాత్రలు తెలుగు వాళ్ళు దొరికితే తమకే చాలా హాయి అని తెలిపారు. ముఖ్యంగా భాష సమస్య ఉండదు కద అని తెలిపారు.దేశభక్తి ప్రేమ రెండిటిని కలిపి యుద్ధం తో రాసిన ప్రేమ కథ అని ఎందుకు పెట్టాలనిపించింది అంటే.. సినిమాలో ప్రతిపాత్ర యుద్ధం చేసుకుంటూ ఉంటుంది.అందుచేతనే అలా క్యాప్షన్ పెట్టామని తెలిపారు.