ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించారు. గత కొద్ది రోజులుగా న్యూమోనియా తో బాధపడుతున్న సిరివెన్నెల గత నెల 24న సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో చేరారు. అప్పటి నుంచి ఆయనకు ఐసియూ లో చికిత్స అందిస్తున్న వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నారు. ఇక ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో తాజాగా తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విన్న వెంటనే చిరంజీవి, తమన్, త్రివిక్రమ్, ప్రకాష్ రాజ్, ఉత్తేజ్ హాస్పిటల్ కు చేరుకున్నారు.
అయితే ఇంతకు ముందే ఆయన పార్థివ దేహాన్ని ఫిలిం చాంబర్ కు తరలించారు. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి, కీరవాణి సిరివెన్నెల భౌతికకాయాన్ని సందర్శించారు. నేడు ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా మూగబోయింది. ఆయన మరణవార్త తెలిసిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.