సిరివెన్నెల మరణించడానికి గల కారణం ఇదేనా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఈయన పాటలు ఎంతో ఆహ్లాదకరంగా వినడానికి ఉంటాయి. అయితే కొద్ది రోజుల క్రితమే ఈయనను కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. కానీ నిన్నటి రోజున సాయంత్రం మరణించడం జరిగింది. అయితే అసలు సిరివెన్నెల చనిపోవడానికి గల కారణాలను కిమ్స్‌ ఎండీ డాక్టర్‌ భాస్కర్‌రావు మీడియాకు వివరించారు. సిరివెన్నెలకు ఆరేళ్ల క్రితం ఊపిరితిత్తుల క్యాన్సర్‌ రావడంతో సగం ఊపిరితిత్తిని తీసేయాల్సి వచ్చిందని, ఆ తర్వాత బైపాస్‌ సర్జరీ కూడా జరిగిందని అన్నారు. వారం క్రితం మరో వైపు ఉన్న ఊపిరితిత్తుకి క్యాన్సర్‌ క్యాన్సర్‌ సోకడంతో దానిని కూడా సగం తొలగించామని అన్నారు.

అయితే సీతారామ శాస్త్రి కి మళ్లీ ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో అడ్వాన్స్‌డ్‌ ట్రీట్‌మెంట్‌ కోసం కిమ్స్‌కు హాస్పిటల్ కి తీసుకొచ్చారు. కిమ్స్‌లో 2 రోజులు వైద్యం అందించగా బాగానే రికవరీ అయ్యారు. 5 రోజుల నుంచి ఎక్మో మిషన్‌పైనే ఉన్నారు. ఆ తర్వాత క్యాన్సర్‌, పోస్ట్‌ బైపాస్‌ సర్జరీ, ఒబీస్‌ పేషెంట్‌ కావడం, కిడ్నీ డ్యామేజ్‌ అవడంతో ఇన్‌ఫెక్షన్‌ మొత్తం శరీరమంతా సోకింది. దీంతో మంగళవారం సాయంత్రం 04:07 నిమిషాలకు సిరివెన్నెల తుదిశ్వాస విడిచారని కిమ్స్‌ ఆసుపత్రి ఎండీ భాస్కరరావు మీడియాకు వెల్లడించారు. ఏది ఏమైనా ఒక దిగ్గజ రచయితను కోల్పోయామని చెప్పుకోవచ్చు

Share.