తెలుగులోఎన్నో వేల పాటలను పాడిన మన తెలుగు గాయకుడు బాలసుబ్రమణ్యం సినీ దిగ్గజాలలో ప్రేక్షకులలో మనసుల్లో చిరంజీవిగా నిలిచిపోయే పేరు బాలసుబ్రమణ్యం చాలామందికి తెలుసు..ఆయనని ముద్దుగా బాలు అని కూడా పిలుస్తారు. ఇక ఆయన 2021 సెప్టెంబర్ 25న కరోనా మహమ్మారి కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. బాలు మరణంతో సినీ పరిశ్రమలో ఒక్కసారిగా మౌనం నిండిపోయింది. బాలు గారు ఎన్నో వేల పాటలను తన స్వరంతో పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారని చెప్పాలి.
అయితే సింగర్ సునీతకు బాలుకు మధ్య ఎంతో మంచి బంధం ఉంది. ఆమె బాలసుబ్రమణ్యం గారిని మావయ్య అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ ఉంటారు. బాలు గారి మరణం తరువాత సునీత మనోవేదనకు గురయ్యారు. అంతేకాకుండా పలు ఇంటర్వ్యూలో బాలు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి బాలుగారీని పోగొట్టుకున్నాను. ఆ తరువాత నాకు కన్నీళ్లు రావడం ఆగిపోయాయి అని సునీత అన్నారు. ఆయన మరణించిన వార్త నాకు గుండెలు పిండేసే సంఘటన అంతకుమించిన సంఘటన ఏముంది. ఇక ఆయన చూపించిన మార్గంలో నడవటమే ఆయనకు మనం ఇచ్చే గౌరవం అంటూ తెలిపింది.. ఆయన పాడిన పాటలతో ఆయన జ్ఞాపకాలతో గడపడమే అని అన్నారు సునీత
దివికెగిసిన బాలసుబ్రమణ్యం ప్రేక్షకుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు అంటూ ఆమె ఎమోషనల్ గా తెలిపింది. అదేవిధంగా సునీత తన జీవితం గురించి మాట్లాడుతూ.. నాకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కొన్ని విలువలు ఉన్నాయి..నా మీద వచ్చే విమర్శలను నేను పట్టించుకోకుండా ముందుకు సాగిపోతున్నాను.. నేను నా జీవితంలో ఏం చేయాలో ఏం చేయగలను నాకు క్లారిటీ ఉంది. ఎవరు ఎన్ననుకున్న ఆ విషయాలను నేను పట్టించుకోను నా జీవితం నాది అంటూ సునీత గారు తెలిపారు.