సింగర్ , డబ్బింగ్ ఆర్టిస్టుల పేరు పొందింది సింగర్ సునీత. 2021 జనవరిలో రెండవ వివాహాన్ని చేసుకుంది ఈమె. అయితే అప్పట్లో ఈ వార్త పైన సంచలనాన్ని సృష్టించింది. సునీత నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి కొంతమంది ఈమె పైన తీవ్రమైన విమర్శలు కూడా చేయడం జరిగింది.ఈ క్రమంలోనే సింగర్ సునీత వివరణ ఇవ్వడం జరిగింది.పిల్లల భవిష్యత్తు తన భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వారి అనుమతితోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని తెలియజేసింది. ఈ విషయంలో తనకు మద్దతుగా నిలవాలని కూడా తెలియజేయడం జరిగింది సునీత.
మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని తో ఈమె రెండో వివాహం చేసుకుంది. రామ్, సునీతల వివాహానికి సినీ ప్రముఖులు ,రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. దీంతో కొన్ని సంవత్సరాలుగా వీరు దాంపత్య జీవితం చాలా ఆనందంగా సాగుతోంది. ఇక అప్పుడప్పుడు పలు విషయాలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది సునీత. సునీత ఇటి వలె గర్భం దాల్చిన ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. దీనిపైన వరుసగా కథనాలు వినపడుతూనే ఉన్నాయి. సునీత ప్రెగ్నెన్సీ వార్తల పైన మాత్రం స్పందించలేదు.
అయితే తాజాగా ఎట్టకేలకు ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది.. త్వరలోనే ఇళయరాజా మ్యూజిక్ కాన్సెప్ట్ జరగబోతోంది ఇందుకు సంబంధించి ప్రమోషన్లు ఈమె ఇందులో మీరు తల్లయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయని ప్రశ్న యాంకర్ అడగగా.. అందుకు సునీత మాట్లాడుతూ ఈ విషయం నాకు కూడా తెలియదు ఈ పుకార్లు పుట్టిస్తున్న వారి ఆలోచన విధానానికి వదిలేస్తున్నాను వారు నన్ను నా జీవితాన్ని ఏమి చేయలేరని సమాధానాన్ని ఇచ్చింది. పరోక్షంగా ఇమే ఈ విషయాన్ని ఖండించిందని చెప్పవచ్చు.