కర్ణాటక రాష్ట్రం బళ్ళారి లో ప్రముఖ సింగర్ మంగ్లీ కారు పై రాళ్లదాడి జరిగినట్లుగా నిన్నటి రోజు నుంచి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ దాడిలో తన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయని బళ్లారి ఉత్సవాలో పాల్గొన్న మంగ్లీ చూసేందుకు స్థానికులు యువకులు అక్కడికి విచ్చేసారని.. మంగ్లీ ఉన్నటువంటి మేకప్ సెట్ లోకి చొరబడే ప్రయత్నం చేశారని దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి యువకులను చెదరగొట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రోగ్రాం తర్వాత మంగ్లీ కారులో వెళుతుండగా ఆమె కారు పైన గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.
బళ్లారి ఉత్సవాల్లో తన పాటలతో బళ్లారి వాసులను అలరించిన మంగలి తాను త్వరలోనే కన్నడ భాష నేర్చుకుంటానని చెప్పింది.. మంగ్లీ కారు పై రాళ్లదాడి వెనుక రెండు కారణాలు వినిపిస్తున్నాయి..తనకు కన్నడ భాష అర్థం కాదని గతంలో ఒక కార్యక్రమం లో మంగ్లీ తెలియజేసింది. దీనిపైన ఆగ్రహానికి గురైన కన్నడ వాసులు ఆమె కారు పైన దాడి చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బళ్లారి ఉత్సవాల్లో మంగ్లీని చూసేందుకు వచ్చిన యువకులపై పోలీసులు లాఠీ చార్జి చేయడంతో మంగ్లీ గారిపై దాడి చేసి ఉంటారని కొంతమంది తెలియజేస్తున్నారు.
కానీ మంగ్లీ మాత్రం అసలు విషయాన్ని బయట పెట్టింది అసలు తన మీద ఎలాంటి రాళ్లదాడి కూడా జరగలేదని తెలియజేస్తోంది. తనపైనే కొందరు పనిగట్టుకొని ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కూడా మండిపడుతోంది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఒక నోట్ ను కూడా విడుదల చేసింది. తాను పాల్గొన్న ఈవెంట్లో ఫోటోలను ,వీడియోలను మీరు చేస్తే ఈవెంట్ ఎంత గ్రాండ్ సక్సెస్ అయ్యిందో మీకే తెలుస్తుంది. నా ఉత్తమ ఈవెంట్లలో ఇది కూడా ఒకటని కన్నడ ప్రజలు తన పైన ఉన్న అభిమానులకు ప్రతి ఒక్కరు కూడా తనకి మద్దతు పలికారు అని తెలియజేస్తోంది. కానీ ఈ ప్రచారాన్ని తాను ఖండిస్తున్నానని మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటారని ఒక నోట్ ని విడుదల చేసింది.
View this post on Instagram