ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల పెళ్లి విషయాల్లో వాళ్ళకంటే ముందే సోషల్ మీడియా పసిగడుతోంది. వారితో పెళ్లి వీరితో పెళ్లి అంటూ వార్తలు కూడా రాస్తున్నారు. ఇలా రాసినప్పుడు ఆ వార్తలు వైరల్ అవ్వడంతో స్వయంగా సెలబ్రిటీలే క్లారిటీ ఇచ్చేవరకు ఆ వార్తలు ఆగటం లేదు. అది పెళ్లి విషయమైనా సరే ఏ ఇతర విషయాలైనా సరే వాళ్లే వచ్చి క్లారిటీ ఇస్తేనే అవి ఆగేలా కనిపిస్తున్నాయి. ఇలా ఎందుకు అంటున్నామంటే
రామ్ పోతినేని పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. కానీ ఇంకా ఆయన క్లారిటీ ఇవ్వలేదు.ఇక గత నాలుగు ఐదు రోజుల నుండి సింగర్ మంగ్లీ పెళ్లి చేసుకోబోతోంది అంటూ సోషల్ మీడియాలో కోడై కూస్తోంది. అయితే ఈమె పై వచ్చే వార్తలకు క్లారిటీ ఇచ్చింది మంగ్లీ.. ఈమె భక్తి పాటలు బతుకమ్మ పాటలు అంతేకాకుండా పలు సినిమాలలో సాంగ్స్లను పాడి ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీ మోస్ట్ సింగర్ గా మారిపోయింది. మంగ్లీ ఒక మామూలు పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి స్టార్ సింగర్ రేంజ్ కి వెళ్లాలంటే ఆమె కష్టం ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. తాజాగా ఈమెపై ఈమె పెళ్లి గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఆమె వయస్సు పెరిగిపోతుండటంతో ఇంట్లో వాళ్ళు ప్రెజర్ వల్ల వరుసకు బావ అయ్యే వ్యక్తిని పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెడుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే తాజాగా ఈ వార్తలపై మంగ్లీ స్పందిస్తూ అసలు ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అలాగే వరుసకు బావ అయ్యే వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని అంటున్నారు..నాకే తెలియని బావ ఎక్కడి నుంచి వచ్చాడు నాకు కూడా తెలియకుండానే నా పెళ్లి చేస్తున్నారా అసలు ఈ వార్తను ఎవరు సృష్టించారు కాస్త నాకు చెప్పండి అంటూ సెటైర్ వేసింది. ఇక ఇప్పుడు మంగ్లీ క్లారిటీ ఇవ్వడంతో ఆమె పెళ్లి వార్తకు పుల్ స్టాప్ పడినట్టే అని చెప్పవచ్చు.