ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన నటించిన తాజా చిత్రం పుష్ప. ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే .ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు, వీడియోలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. అంతేకాకుండా పుష్ప సినిమాలోని పాటలు సోషల్ మీడియా లో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ అయినా ఊ అంటావా మావా అనే పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా కూడా ఈ పాట మార్మోగిపోతోంది.
ఈ పాటను సింగర్ మంగ్లీ సోదరి పాడిన విషయం అందరికి తెలిసిందే. ఈ పాటతో సింగర్ ఇంద్రావతి చౌహన్ ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఈ పాటను ఇంద్రావతి పాడటం ఒక ఎత్తు అయితే, లిరికల్ వీడియోలో ఇంద్రావతి చౌహాన్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మరొక ఎత్తు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఈమె పేరు మార్మోగిపోతోంది. ఇక చెల్లెలు విజయంపై సింగర్ మంగ్లీ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది.ఊ అంటావా మావా అనే పాట నాలుగు రోజుల్లోనే మూడు కోట్ల వ్యూస్ రాబట్టి ఇంత పెద్ద విజయాన్ని సాధించడం నాకు చాలా సంతోషంగా ఉంది. కంగ్రాట్స్ ఇంద్రావతి చౌహన్.నీ డెబ్యూతో ఇంత పెద్ద సక్సెస్ అందుకున్నావ్.. ముందు ముందు మరిన్ని అవకాశాలు రావాలి మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేసింది.