తెలుగు ఇండస్ట్రీలో సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది గీతా మాధురి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..గీతా మాధురి నటుడు నందుని పెళ్లి చేసుకొని ఒక పాపకు కూడా జన్మనిచ్చింది. ఈమె తెలుగు, తమిళ ,కన్నడ ,మలయాళం భాషలలో కలిపి దాదాపు 1600కు పైగా పాటలు పాడి ఫేమస్ సింగర్ గా పేరు తెచ్చుకుంది.
ఈ విషయం కాస్త పక్కన పెడితే గీత- నందు ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారని అందుకే ఏ పబ్లిక్ ఈవెంట్ లో కూడా ఇద్దరు కలిసి కనిపించడం లేదని సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని..నందు (మాన్షన్ -24) అనే వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా బయట పెట్టాడు. గీతా మాధురి బిగ్ బాస్ 2 సీజన్లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే..
ఇక బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఆమెపై ట్రోల్స్ బాగానే వచ్చాయి. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో గీతామాధురి నటుడు సామ్రాట్ తో క్లోజ్ గా ఉండటం అతనితో ఎక్కువగా మాట్లాడటం చాలా మంది ఈమెపై నెగటివ్ కామెంట్స్ వర్షం కురిపించారు.మరికొంతమంది యూట్యూబ్లో థంబ్ నెయిల్ సృష్టించి మరి వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అంటూ రకరకాలుగా కామెంట్స్ కూడా చేశారు.
అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన గీతా మాధురి తన భర్త నందుకు విడాకులు ఇచ్చేసి సామ్రాట్ ను రెండో పెళ్లి చేసుకుంటుందని ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ విషయాన్ని ఎవరు ఖండించకపోవడంతో అందరూ నిజమే అని భావించారు. కానీ అదే సమయంలో గీతా మాధురికి ఒక పాప పుట్టటంతో అందరి నోర్లు మూసినట్టయింది. అలా మెల్లమెల్లగా తనపై వస్తున్న పుకార్లు ఆగిపోయాయి. ప్రస్తుతం నందు గీతామాధురి కలిసి తమ జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.