అమ్మ పై కూడా, నాన్న అందుకే చనిపోయారు: ప్రముఖ సింగర్ చిన్మయి షాకింగ్ ట్వీట్

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ సింగర్ చిన్మయి గత రెండు రోజులుగా తన జీవితంలో తన పై జరిగిన పలు చేదు అనుభవాలని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. ఇక ఈ రోజు ఆమె మరికొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు అవేంటంటే ” తన తల్లి ని అదే కుటుంబానికి చెందిన మా అమ్మ గారి అక్క భర్త ఒకరు అనేక సార్లు లైంగికంగా వేధించారని, ఇలా ఆ వ్యక్తి మా అమ్మని లైంగికంగా వేధించిన తర్వాత ప్రతి సారి గొడవ చేయకుండా ఉన్నందుకు మా అమ్మకు థాంక్ యూ చెప్పేవాడు, ఈ విషయం మా కుటుంబం లో ఉన్న అందరికి తెలుసు కానీ మా ఆంటీ ని ఏమైనా అంటాడేమోనని ఎవరు అతన్ని ఒక్క మాట కూడా అనలేక పోయారు, అతను కుటుంబం లోని ప్రతి మహిళతో ఇంతే ప్రవర్తించేవాడని ట్వీట్ చేసారు సింగర్ చిన్మయి.

మా అమ్మ తరుపు బంధువులు ఆమెని కేవలం డబ్బు కోసం వాడుకునేవారని, ఆమెని తర్వాత ఎన్నో సార్లు మోసం చేసారు. కానీ మా అమ్మ మాత్రం ఈరోజుకి తన కుటుంబ సబ్యులని ఎంతో ప్రేమతో చూసుకుంటది. ఇక పది ఏళ్ల క్రితం మా అమ్మకి పారనోయిడ్ స్కిజోఫ్రీనియా అనే ఒక వ్యాధి తో ఆసుపత్రి లో చేరింది, ఈ వ్యాధి వలన ఆమెకి సుమారు 5 ఏళ్ల నుండి తనను ఎవరో బలవంతంగా వచ్చి లైంగికంగా వేధిస్తున్నట్టు ఉహించుకునేది. వైద్యులని అడిగితే తనకి గతంలో జరిగిన వేధింపుల వలెనే ఇటువంటి సమస్య వచ్చిందని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కొంత మంది గిట్టని వాళ్ళు మా అమ్మకి పిచ్చి పట్టిందని అనే వాళ్ళు.

ఇది చూసి తట్టుకోలేని మా నాన్న మద్యానికి బానిసైయ్యారు, లివర్ చెడిపోయి గత నెల జూన్ లో చనిపోయారు. నేను కూడా మూడు సార్లు సూసైడ్ చేసుకుని చని పోదాం అనుకున్న. కానీ నేను కేవలం మా అమ్మ కోసమే బ్రతికి ఉన్న…ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కొంత మంది చేసే రాక్షస పనులు ఇతరులని ఎంత గా బాధ పెడతాయో చెప్పటం కోసమే. ఈ రోజు నా జీవితంలో అంత చీకటిగా ఉంది, కానీ నాకు జీవితం పై ఆశ ఉంది ఏదో ఒక రోజు ఇదంతా సర్దుకుంటుందనే ఆశ తో బ్రతుకుతున్న. ఇలా మార్పు కోసం ఎదురు చూసే ప్రతి మనిషి జీవితం పట్ల ఆశని కోల్పోకుండా ముందుకు వెళ్లాలని నేను కోరుకుంటున్న.

Share.