సీనతల్లిగా నటించడం కోసం ఎలకలు కూడా తిన్నానంటున్న హీరోయిన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సూర్య హీరో గా నటించిన తాజా చిత్రం జై భీమ్. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మా కొంతమంది విమర్శకుల నుండి కూడా ప్రశంసలు అందుకుంది. ఒక గిరిజన యువకుడు హత్య, చంద్రు జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని ఈ సినిమాని తీయడం జరిగింది. ఇక ఇందులో డి గ్లామరస్గా నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది సినతల్లి, ఈమె అసలు పేరు” లిజోమోల్ జోస్” ఈమె సినతల్లి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించింది. ఈమె ఇది వారకే కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

జై భీమ్ సినిమాలో డీ గ్లామరస్ గా నటించేందుకు అంగీకరించింది. అయితే లిజోమోల్ జోస్ మాట్లాడుతూ సిన తల్లి పాత్రలో నటించడానికి చాలా కష్టపడ్డానని తెలియజేసింది. ఒక తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా తెలిపింది. జై భీమ్ సినిమా కథను డైరెక్టర్ జ్ఞానవేల్ తనకు చెప్పగానే పాత్ర బాగా అర్థం అయింది. ఈ పాత్ర చేయాలంటే చాలా కష్టపడాలి అని అర్థం చేసుకొని, చాలా హార్డ్ వర్క్ చేశానని తెలియజేసింది.

పాత్ర కోసం తను చాలా డైటింగ్ చేసి బరువు కూడా తగ్గించాను, నేను ఈ సినిమాలో చేసింది గిరిజన మహిళ పాత్ర, కొంతమంది గిరిజన తెగకు చెందిన మహిళలను కలుసుకొని, వారితో కొద్ది రోజులు గడిపాను, వారు ఎలా ఉంటారో ఏం తింటారో అనే రీసర్చ్ కూడా చేశాను. ఇక వారితో పాటే కలిసి ఎలుకలు పట్టడానికి ట్రైనింగ్ తీసుకుని, ఒకసారి ఎలుక మాంసం కూడా తిన్నానని చెప్పుకొచ్చింది. ఇదంతా కేవలం పాత్ర కోసమే చేశానని తెలియజేసింది.

Share.