తెలుగు సినీ ప్రేక్షకులకు సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ తరం వారికి ఈమె గురించి పెద్దగా తెలియకపోవచ్చు.సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. ఈమె 1960 డిసెంబర్ 2న ఏలూరులో జన్మించింది. పదవ తరగతి వరకు చదివి ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మానేసింది. అనంతరం ఆమె తల్లిదండ్రులు 17 ఏళ్లకే పెళ్లి చేయడంతో భర్త అత్తమామల వేధింపులు తాళలేక ఇంటి నుంచి పారిపోయింది.ఆ తర్వాత నటన పై ఉన్న ఆసక్తితో మద్రాసుకు వెళ్లి మొదట టచప్ ఆర్టిస్ట్ గా పనిచేసింది.
అలా మొదట ఘరానా గంగులు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాదేశం సినిమాలో నేనొక నెత్తురు దీపం పాటకు లో ఐటమ్ గర్ల్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే అప్పటికే జ్యోతిలక్ష్మి,జయమాలిని ఇలాంటి వారు ఉన్నప్పటికీ అప్పట్లో టాప్ హీరోలందరి సినిమాలో సిల్క్ స్మిత డ్యాన్సులు స్టెప్పులు ఉండాల్సిందే అంతలా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. కానీ ఈమె అర్ధాంతరంగా 1996 సెప్టెంబర్ 23న ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.