కియారా – సిద్ధార్థ్ లకు త్వరలో పెళ్లి.. ఇందులో నిజమెంత?

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ ప్రేమ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా లు గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. వీరి డేటింగ్ లో ఉన్నప్పటికీ వారి రిలేషన్ పై ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. వారు డేటింగ్ లో ఉంటున్న విషయాన్ని గోప్యంగా ఉంచుతూ ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. వీరిద్దరూ కలసి హాలిడే వెకేషన్స్ కు వెళ్ళడం, అలాగే ముంబై రోడ్లపై చట్ట పట్టా లేసుకొని తిరగటం లాంటివి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ ప్రేమజంట తమ రిలేషన్ షిప్ ను బయటపెట్టాలని ఆలోచిస్తున్నారట. కొత్త సంవత్సరం సందర్భంగా వారిద్దరూ కలసి తమ ప్రేమను అఫిషియల్గా అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ బాలీవుడ్ సినీ వర్గాల్లో వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ జంట త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. వీరిద్దరూ తొలిసారిగా షెర్ష సినిమాల్లో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ చిగురించింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

Share.