టాలీవుడ్ ఇండస్ట్రీకి చిన్నచిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ పొజిషన్ కి ఎదిగిన హీరో సిద్ధార్థ్ . ఈయన నటించిన బొమ్మరిల్లు చిత్రంతో చెరిగిపోని ముద్రను వేసుకున్నాడు. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో ఇంకాస్త పాపులారిటీని సంపాదించుకున్నాడు.అప్పట్లో బొమ్మరిల్లు సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అప్పట్లో ఈ రెండు సినిమాలు ఎన్నో అవార్డులను రికార్డులను కొల్లగొట్టాయి. ఈ రెండు సినిమాల వల్ల సిద్ధార్థ్ కు ఎన్నో ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. కానీ అవన్నీ ఆ సినిమాల స్థాయిని అందుకోలేకపోయాయి. ఇక త్రిష తో నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే సిద్ధార్థ ఏ హీరోయిన్ తో నటించిన ఆ హీరోయిన్ తో ప్రేమాయణం సాగిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.
సిద్ధార్థ్ ఒకప్పుడు అన్ని సక్సెస్‌లే సాధించాడు. కానీ ఇప్పుడు మాత్రం అన్ని ప్లాపులుగానే మిగులుతున్నాయి. మొదట త్రిష ఆ తరువాత జెనీలియా… ఆ తరువాత శృతిహాసన్ ఆ తరువాత సమంత… ఇప్పుడు అదితి రావు హైదరి.. ఇలా ఆయనతో సినిమాల్లో నటించే హీరోయిన్స్ అందరితోనూ ట్రాక్ ని నడిపాడు. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా మంచి పేరును సంపాదించుకున్న హీరో కమలహాసన్ కూతురు శృతిహాసన్ తో కూడా ప్రేమాయణం నడిపాడట. వీరిద్దరూ కలిసి రెండు సినిమాల్లో నటించారు.
అదే టైంలోనే వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మొదలై ఆ తర్వాత ప్రేమకు దారి తీసి రాత్రి పగలు తేడా లేకుండా తెగ ఎంజాయ్ చేశారనే వార్తలు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి..అయితే ఈ విషయం తెలుసుకున్న కమలహాసన్. సిద్ధార్థ్ రంగును బయటపెట్టి వాళ్ళిద్దరి ప్రేమకు చెక్ పెట్టాడు. దీంతో మళ్లీ వీరిద్దరూ కలవలేదు కానీ శృతిహాసన్ కూడా ఆ తర్వాత వేరొకరితో లవ్ లో పడింది.