హీరోయిన్ అదితి రావు హైదరి కి గతంలో బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే గత కొంతకాలంగా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. మరొక హీరో సిద్ధార్థ్ కూడా ఇదివరకే వివాహం చేసుకొని విడిపోవడం జరిగింది 2003లో మేఘన అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు సిద్ధార్థ. ఆ తర్వాత 2007లో విడిపోయారు.ఆ తర్వాత కొన్నాళ్లు సింగల్ గా ఉన్న సిద్ధార్థ మహాసముద్రం సినిమాతో హీరోయిన్ అతిధి తో ప్రేమలో పడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి .ఈమధ్య ముంబైలో జరిగిన ఒక ఫంక్షన్ లో కూడా వీరిద్దరూ కనిపించారు.
దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని హింట్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి తోడు నటుడు శర్వానంద్ నిశ్చితార్థ వేడుకలలో జంటగా కనిపించారు. ఇక నెక్స్ట్ వివాహం చేసుకోబోయేది వీళ్లే అంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అదితి, సిద్ధార్థ ల పెళ్లికి సిద్ధమవుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇద్దరు రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే కానీ పెళ్లి మా ఇద్దరికీ కలిసి రాలేదంటూ తెలియజేసినట్లు తమ స్నేహితులు దగ్గర నుంచి వార్తలు వినిపిస్తున్నట్లు సమాచారం.
మరైతే వివాహం చేసుకుంటారా లేదా అనే విషయం సస్పెన్స్ గానే సాగుతున్నది. అయితే సోషల్ మీడియాలో వీరి గురించి మాత్రం పెళ్లి రూమర్స్ వినిపిస్తున్నాయి.కానీ వీరిద్దరూ మాత్రం ఈ విషయాన్ని ఖండించలేదు. దీంతో పెళ్లి పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి ప్రస్తుతం వీరిద్దరూ కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అదితి మొదటి భర్త కూడా బాలీవుడ్ నటి కుమార్తెను వివాహం చేసుకున్నారు.