హీరోయిన్ అదితి రావు హైదరి, హీరో సిద్ధార్థ్ ప్రేమలో ఉన్నారని గడిచిన కొద్ది రోజుల నుంచి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి మహాసముద్రం అనే సినిమాలో జంటగా నటించడం జరిగింది. ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య కాస్త సన్నిహిత్యం ఎక్కువగా ఉందని డేటింగ్ లో ఉన్నారంటూ పలు రూమర్లు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇక త్వరలోనే వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారని వార్తలు కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే వీరిద్దరూ పలు ఫంక్షన్లకు సినిమా ఈవెంట్లకు పార్టీలకు వెళుతూ ఉన్నారు.
ఇక ఇటీవలే శర్వానంద్ ఎంగేజ్మెంట్ కు కూడా హాజరైన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా సిద్ధార్థ్ తో కలిసి అదితి ఒక ట్రెండింగ్ సాంగ్ కు ఇద్దరు కలిసి ఉషారుగా డాన్స్ వేయడం జరిగింది అందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందంటూ మళ్లీ వార్తలు తెరమీదకి రావడం జరుగుతుంది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.
ఇక హన్సిక దియా మీర్జా లాంటి సెలబ్రిటీలతోపాటు పలువురి నటిజెన్లు ఈ వీడియోని చూసి పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.త్వరగా మీ లవ్ అనౌన్స్మెంట్ చేయండి లవ్ లవ్ ఈసారి ఈ కోతుల నుంచి ఇంకా ప్రేమ కావాలి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు అదితి-సిద్ధార్థ్ తమ వ్యవహారాన్ని అధికారికంగా ప్రకటించలేదు.సిద్ధార్థ్ గతంలో పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్నారు.. అదితి కూడా వివాహం చేసుకొని విడాకులు తీసుకుంది.
View this post on Instagram