ట్విట్టర్ లో ప్రభాస్ ఫ్యాన్స్ పై సిద్దార్థ్ ఫైర్

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ నటుడు సిద్దార్థ్ ఈ రోజు ట్విట్టర్ వేదికగా ప్రభాస్ అభిమానుల పై అసహనం వ్యక్తం చేసాడు. తాజాగా ట్విట్టర్ లో అభిమానులు తమ హీరో పుట్టిన రోజు వేడుకని హాష్ టాగ్ తో కొన్ని రోజుల ముందు నుండే మొదలు పెడుతున్నారు. అయితే తాజాగా హీరో ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబర్ 23న జరగనుంది, దీనికి అభిమానులు ఇప్పటి నుండే ట్విట్టర్ లో 100 డేస్ టు కింగ్ ప్రభాస్ బర్త్ డే కౌంట్ డౌన్ బిగిన్స్ అంటూ పోస్ట్లు పెట్టారు. ఇది చూసిన సిద్దార్థ్ ఈ పోస్ట్ కి రిప్లై చేస్తూ ‘ ఈ పుటిన రోజు పూర్తయిన 465 రోజుల్లో ప్రభాస్ నెక్స్ట్ బర్త్ డే వస్తుందని కౌంట్ డౌన్ కంటిన్యూ అవుతుందని ‘ సెటైర్ వేసాడు. ఇంకా ట్వీట్ చేస్తూ ‘ హాష్ టాగ్స్ థ్రిల్ ఇవ్వాలి తప్ప ఇటువంటివి థ్రిల్ ని కిల్ చేస్తాయి అని, కొంచం అలోచించి ఇటువంటి హాష్ టాగ్స్ వాడమని రోజురోజుకి హాష్ టాగ్స్ మరి వ్యంగ్యంగా అవుతున్నాయని’ సిద్దార్థ్ అభిమానులకి సూచించాడు. అయితే దీనికి ప్రభాస్ ఫ్యాన్స్ కొంత మంది ఇదే ట్వీట్ హీరో అజిత్, విజయ్, రజిని ల పై చేసి చూడు అని కౌంటర్ వేశారు. మరి కొంత మంది మాత్రం సిద్దార్థ్ కి మద్దతు పలికారు. కొంత మంది ఫ్యాన్స్ ప్రభాస్ మీ ఫ్రెండ్ కదా ఎందుకు ఇలా అన్నారు అని అడగ్గా
దీనికి సిద్దార్థ్ ” ప్రభాస్ నా ఫ్రెండ్ కాబట్టే ఆ చనువుతో ఈ మాట అన్నాను” డార్లింగ్ కూడా నవ్వుతాడు ఈ జోక్ విని, ప్రతిదానికి టెన్షన్ పడితే లైట్ తీసుకోవటానికి టైం ఉండదు కాదు భయ్యా”అని ముగించారు.

Share.