టాలీవుడ్లో హీరోయిన్ శృతిహాసన్ కమలహాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు అవుతోంది. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ల లో కూడా ఒకరిని చెప్పవచ్చు. శృతిహాసన్ కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించింది. అయితే శృతిహాసన్ కెరియర్ మొదట్లో వరుసగా ప్లాపులను చవిచూచింది. అటు తరువాత పవన్ కళ్యాణ్ తో కలిసి గబ్బర్ సింగ్ సినిమాలో నటించి శృతిహాసన్ కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.
ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతోంది శృతిహాసన్. ఇక సినిమాల విషయం పక్కన పెడితే ఈమె వ్యక్తిగత జీవితంలో కూడా ఎప్పుడు వివాదాస్పందంగా మారుతూ ఉంటుంది. గతంలో ఒక హీరోతో ప్రేమలో ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి. ఆ హీరోతో బ్రేకప్ అయిన తర్వాత మరొక వ్యక్తితో ప్రేమలో పడడం నచ్చకపోతే విడిపోవడం ఆ తర్వాత మరొక బాయ్ ఫ్రెండ్ ని చూసుకోవడం వంటివి చాలా ఫాస్ట్ గా చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు శృతిహాసన్ మరొకసారి బ్రేకప్ న్యూస్ వైరల్ గా మారు తోంది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం ముంబైలో ఉంటోంది. శృతిహాసన్ డూడూల్ ఆర్టిస్ట్ శాంతాతో రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నట్లుగా సమాచారం. రెండేళ్లుగా శృతిహాసన్ శాంతా మధ్య రిలేషన్ బాగానే కొనసాగింది. మొదటిసారి శృతిహాసన్ చెల్లెలి అప్సరహాస బర్తడే వేడుకలలో కనిపించారు. ఈ ఫంక్షన్కు కమలహాసన్ సైతం హాజరయ్యారు ఈ సందర్భంగా తన తండ్రికి శాంతాన్ని పరిచయం చేసింది శృతిహాసన్.
దీంతో కొత్త బాయ్ ఫ్రెండ్ తెరమీదకి రావడం జరిగింది. అటు తర్వాత శాంతా తో కలిసి ఎంజాయ్ చేసిన ఫోటోలు షేర్ చేసింది. తాజాగా శృతిహాసన్, శాంత విడిపోయారని వార్త వైరల్ గా మారుతోంది. ఈ వార్తలు వినిపించడానికి ముఖ్య కారణం పోస్టుల నాతో నేనే ఉంటేనే సంతోషం నా విలువ సమయాన్ని ఒంటరితనాన్ని ప్రేమిస్తున్నాను జీవితంలో ఇక్కడ వరకు రావడం గొప్ప అదృష్టం అందుకు కృతజ్ఞతలు ఎట్టకేలకు నాకు ఆ విషయం బోధపడింది అనే కామెంట్ పోస్ట్ చేయడం వల్ల శాంత శృతి బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు వైరల్ గా మారాయి.
View this post on Instagram