Shruti Hassan..ప్రస్తుతం హీరోయిన్ శృతిహాసన్(Shruti Hassan) కెరియర్ చాలా స్పీడుగా దూసుకుపోతోంది. సీనియర్, జూనియర్ అనే సంబంధం లేకుండా హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలయ్య తో వీరసింహారెడ్డి వంటి సినిమాలో నటించింది. ఇద్దరు సీనియర్ హీరోలు అయినప్పటికీ హీరోలకు దీటుగా నటించింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఈ రెండు సినిమాలతో మంచి సక్సెస్ను అందుకుంది.
హీరో, హీరోయిన్ల మధ్య వయసు వ్యత్యాసం చాలానే ఉన్నప్పటికీ ఆడియన్స్ కు మాత్రం వెండితెర పైన చూస్తుంటే ఎలాంటి ఫీలింగ్ కలగలేదు..ముఖ్యంగా చిరంజీవి,బాలయ్యలతో రొమాంటిక్ సాంగ్ లో కూడా ఇరగదీసింది ఈ ముద్దుగుమ్మ.. అయితే వాల్తేర్ వీరయ్య సినిమా విషయంలో అభిమానులు కాస్త ఫీలయ్యారు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి శృతిహాసన్ రాకపోవడం జరిగింది.అయితే ఆమె ఎందుకు రాలేదని విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి..
వాటికి తోడు శృతిహాసన్ తనకు అనారోగ్య కారణంగా రాలేకపోయినట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం జరిగింది.శృతిహాసన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.. ఫ్యాన్స్ ఫెస్టివల్ లో భాగంగా వీరయ్య సినీమాలో డాన్సులు తనతో బలవంతంగా చేయించినట్లు తెలియజేసింది..మంచులో డ్యాన్స్ చేయడం కష్టంగా ఉంటుందని అందులోను చలిని తట్టుకోవడం చాలా కష్టమని హీరోలకు చలి లేకుండా జాకెట్లు ఉంటాయి కానీ హీరోయిన్లకు ఆ రకమైన వసతి ఉండదు కనీసం శాలువా కూడా ఇవ్వరు.. కేవలం చీర చిన్న జాకెట్ వేసుకొని ఆ మంచులో డాన్స్ వేయాల్సి ఉంటుంది..
హీరోయిన్ల విషయంలో ఇలాంటివి ఆపాలని కోరుకుంటున్నాను అని తెలిపింది.. ఎందుకంటే ఆ మధ్య ఇలాంటి అనుభవం తనకు కూడా ఎదురైందని తెలిపింది.దీంతో ఇప్పుడు ఈ వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి శృతిహాసన్ వాక్యాలపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తూ ఉన్నారు. కొంతమంది శృతిహాసన్ మద్దతు తెలుపుతుంటే మరి కొంతమంది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు ఆ మాత్రం కష్టపడలేరా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంపై మెగా టీం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి ప్రస్తుతం శృతిహాసన్ మాత్రం ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటిస్తోంది.