ప్రముఖ కోలీవుడ్ నటుడు కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ శృతిహాసన్. ఇమే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన శృతిహాసన్ టాలీవుడ్ లో కూడా హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. అనగనగా ఒక ధీరుడు సినిమా ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో నటించింది. టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నది ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న శృతిహాసన్ రవితేజ తో నటించిన క్రాక్ చిత్రంతో రియంట్రి ఇచ్చింది.
ఈ సినిమాతో మళ్లీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ ముద్దుగుమ్మ బాలకృష్ణ, చిరంజీవితో కలిసి వీర సింహారెడ్డి వాల్తేర్ వీరయ్య చిత్రంలో నటించి మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న శృతిహాసన్ ప్రభాస్ తో కూడా సలార్ సినిమాలో నటిస్తున్నది.శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది.తన చిత్రాలకు సంబంధించి వ్యక్తిగత విషయాలను కూడా తెలియజేస్తూ ఎప్పుడు బిజీగానే ఉంటుంది.
తాజాగా శృతిహాసన్ తన జీవితంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలను గురించి తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. 2012లో తనకు ఎదురైన చేదు అనుభవాలను తలచుకుంటూ ఒక పోస్టుని షేర్ చేయడం జరిగింది. 2012లో ఇది తన ఫోటో ఇదే ..ఆ ఏడాది వ్యక్తిగతంగా తనకు మంచి జరగలేదని కూడా తెలిపింది. వృత్తిపరంగా చాలా మార్పులు జరిగాయి అప్పుడు తన జీవితం నకిలీ వైపు బలమైన గాలి వీచింది ..అప్పుడు నాలో మండే మంటలు ఒక బాధ ఉంది నా భవిష్యత్తు కోసం ఎప్పుడు ఏదో ఒకటి వెతుకుతూ.. ఇక ఏదో నేర్చుకోవాలని కలలుకనే దాన్ని జీవితం నిశ్శబ్దం అనేది హింసాత్మకంగా ఉంటుంది అంటూ పోస్ట్ షేర్ చేసింది.
View this post on Instagram