తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్లలో శృతిహాసన్ కూడా ఒకరు. ఈమధ్య అగ్ర హీరోల సినిమాలలో నటించేందుకు ఈమెన ఎక్కువగా తీసుకుంటూ ఉంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంటోంది శృతిహాసన్. వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల కాస్త మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లుగా తెలియజేసింది. తాజాగా తన ఆరోగ్యం బాగలేదని శృతిహాసన్ స్వయంగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేయడం జరిగింది. వాల్తేరు వీరయ్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లేకపోవడానికి పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది.
దీంతో శృతిహాసన్ ఆరోగ్యానికి ఏమైంది అంటు అభిమానులు చాలా ఆందోళన పడుతున్నారు. తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతిహాసన్ తన మెంటల్ హెల్త్ కు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. గడచిన కొద్ది రోజులుగా తను మానసిక సమస్యలతో చాలా సతమతమవుతున్నట్లుగా తెలియజేస్తోంది.. ఉన్నట్టుండి ఉద్రేకమావడం సహనాన్ని కోల్పోవడం కొన్ని సందర్భాలలో తీవ్రమైన ఆవేశానికి గురవుతున్నట్లుగా తెలియజేసింది. షూటింగ్ స్పాట్లలోనైనా అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే విపరీతమైన కోపం వస్తుందని తెలియజేస్తోంది. దీని నుంచి బయట పడేందుకు చికిత్స తీసుకుంటున్నానని తెలియజేస్తోంది శృతిహాసన్.
ఇక ఈ ఏడాది శృతిహాసన్ అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నది. ముఖ్యంగా బాలకృష్ణతో నటించిన వీర సింహారెడ్డి సినిమా విడుదలై బాగానే ఆకట్టుకుంటోంది .చిరంజీవితో నటించిన వాల్తేర్ వీరయ్య సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమా ఈ రోజున విడుదలై బాగానే ఆకట్టుకున్నట్లు సమాచారం. అలాగే ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తాది. ఇక ఏడాది శృతిహాసన్ హవ బాగానే కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే శృతిహాసన్ వ్యాధి గురించి విన్న అభిమానుల సైతం చాలా కంగారు పడుతున్నారు. ప్రస్తుతం శ్రుతి చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.