టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ శృతిహాసన్ కూడా ఒకరు.. శృతిహాసన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి విజయాలను అందుకుంది. దీంతో ఈ అమ్మడు క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది.. ఇదంతా ఇలా ఉంటే తాజాగా మీడియాతో మాట్లాడిన శృతిహాసన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా శృతిహాసన్ మాట్లాడుతూ.. ఈ మధ్య సీనియర్ హీరోల చిత్రాలలో నటించడంపై కొంతమంది విమర్శించారు.. ఆ రెండు సినిమా కథలు నాకు నచ్చడం వల్లే వాటిలో నటించాను అంతేకాకుండా ఇక్కడ హీరోలు వయస్సు నేను అసలు పట్టించుకోలేదు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. దీంతో నాకు చాలా ఆనందంగా ఉందంటూ తెలుపుతోంది శృతిహాసన్. మొదట నేను హిందీ సినిమాలతో తన కెరియర్ ప్రారంభించారు ఆ తర్వాతే తెలుగు తమిళ వంటి భాషలలో నటించానని తెలుపుతోంది.
శృతిహాసన్ కు స్టార్ డం రావడానికి ముఖ్య కారణం తెలుగు ఇండస్ట్రీలో ఉండే ప్రేక్షకులై అని తెలుపుతోంది. అందుకే సినిమాల పట్ల విశ్వాసంగా ఉంటాను తెలుగులో నేను నటించిన మొదటి సినిమా ఫ్లాప్ అయ్యింది.. అది తన కెరియర్ను సందిగ్ధంలో పడేసింది. ఆ తర్వాత పవన్ తో గబ్బర్ సింగ్ సినిమా చేసి తన కెరీయర్ని మార్చుకున్నారని తెలిపింది.ఆ తర్వాత నటించిన ఎన్నో చిత్రాలు వరుసగా విజయాలు అందుకున్నాయని చెప్పుకొచ్చింది శృతిహాసన్.. ప్రస్తుతం ప్రభాస్ సరసన సాలార్ సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తోంది.