తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కు ఒక వెలుగు వెలుగుతున్న వారితో హీరోయిన్స్ శృతిహాసన్ కూడా ఒకరు. ప్రస్తుతం తక్కువ సినిమాలు చేస్తున్నప్పటికీ. ఆచితూచి అడుగులు వేస్తోంది. సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతూనే ఉంటుంది. తన ఫస్ట్ క్రష్ గురించి శృతిహాసన్ మాట్లాడుతూ పలు షాకింగ్ కామెంట్లు చేసింది. ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో మారుతున్నాయి.
శృతిహాసన్ మొదటి క్రష్ హాలీవుడ్ నటుడు బ్రూస్లీ అని తెలియజేసింది.. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు శృతిహాసన్ ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది.సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ తరచూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తన మనసులో ఏది దాచుకోకుండా మనసులోని భావాలను తెలియజేసే విషయంలో ఈ ముద్దుగుమ్మ ముందు వరసలోనే ఉంటుంది ప్రియుడితో కలిసి దిగిన కొన్ని ఫోటోలను తరుచూ షేర్ చేస్తూ ఉంటుంది.
శృతిహాసన్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు ఇంకా తెలియాల్సి ఉంది.. శృతిహాసన్ ఇతర భాషలలో కంటే తెలుగులోనే బాగా సక్సెస్ అయిందని చెప్పవచ్చు. శృతిహాసన్ గతంలో ఎఫైర్స్ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం ఒక చిత్రానికి రూ .3కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.. తన కథకు పాత్రకు ప్రాధాన్యత ఇస్తూ మంచి కథలను ఎంపిక చేసుకోవడం ద్వారా నిరంతరం వార్తలను నిలుస్తూనే ఉంటుంది.
ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాలో నటిస్తోంది.. శృతిహాసన్ తెలుగులో కొత్త ప్రాజెక్టును మాత్రం ఇంకా ప్రకటించలేదు. శృతి హాసన్ కొత్త ప్రాజెక్టులను ప్రకటించకపోవడంతో త్వరలోనే ఈమె వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. శృతిహాసన్ తెలుగులో మరింత బిజీ హీరోయిన్గా కావాలని ఆమె అభిమానులైతే కోరుకుంటున్నారు.