టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ తమి ళ బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వ్యవహరించనున్నారు అంటూ కోలీవుడ్ వర్గాల లో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ లో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ నడుస్తోంది.ఈ షోకి కమలహాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే కమల్ హాసన్ కు కరోనా పాజిటివ్ రావడంతో అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆ షోకి కొత్త వ్యాఖ్యాత ఎవరు అనే చర్చ ఆసక్తికరంగా మారింది.
దీనితో కమలహాసన్ ఈ స్థానంలో హోస్ట్ గా అతని కుమార్తె శృతి హాసన్ ను తీసుకోవాలని బిగ్ బాస్ షో నిర్వాహకులు అనుకుంటున్నారట.ఇందుకోసం శృతి హాసన్ ను సంప్రదించారని టాక్ కూడా వినిపిస్తోంది. శృతి హాసన్ కూడా హోస్ట్ గా వ్యవహరించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శృతి హాసన్ తో పాటు తాత్కాలిక వ్యాఖ్యాత లిస్టు లో హీరో సూర్య, లెజెండ్రీ యాక్ట్రెస్ రమ్యకృష్ణ ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి కమలహాసన్ స్థానంలో ఎవరిని తీసుకు వస్తారు తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.