ప్రభాస్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చిత్రం సలార్. ఈ చిత్రాన్ని హోంభలే ఫిలిం సంస్థ నిర్మిస్తోంది. ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలకమైన పాత్రలో పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కూడా చివరి దశలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి తాజాగా ఈ చిత్రం పైన హీరోయిన్ శృతిహాసన్ కామెంట్లు చేయడం జరిగింది. అవి వైరల్ గా మారుతున్నాయి.
శృతిహాసన్ ఈ సంక్రాంతికి విడుదలైన రెండు చిత్రాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి.ఈ రెండు సినిమాలు హిట్ అయిన నేపథ్యంలో చాలా హుషారుగా ఉంటోంది. శృతిహాసన్ మాట్లాడుతూ సలార్ చిత్రం భారీ ప్రాజెక్టు అని అందులో భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తోంది. ప్రశాంత్ నీల్ తన చిత్రాలకు ఎల్లప్పుడూ తీసుకొనే అద్భుతమైన లేయర్స్ అన్నిటిని కూడా ప్రేక్షకులు ఆశించిన స్థాయిలోనే ఉంటాయి. అలాగే కథకు తన పాత్ర చాలా కీలకమని తెలియజేసింది అయితే ఇదే విషయమై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
గతంలో కూడా చాలామంది హీరోయిన్స్ ఇలాంటి హీరో ఓరియంటెడ్ చిత్రాలలో కీలకమైన పాత్రను పోషించారు కానీ ఆ సినిమాలు చూసిన తర్వాత ప్రేక్షకులు వారు కేవలం హీరోలకు పక్కన పాటల కోసమే పెట్టారని గ్రహించారు. డైరెక్టర్ ప్రశాంత్ నిల్ హీరోయిన్లకు పెద్దగా ప్రాపర్టీ ఇవ్వరు. అలాగే ఉగ్రం, కేజీఎఫ్ సినిమాలలో చూస్తే మనకి ఈ విషయం అర్థం అవుతుంది. మరి శృతిహాసన్ చెప్తే మాటలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇందులో ఈమె జర్నలిస్టు పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా హీరో జీవిత కథను తెలుసుకునే విషయం కోసం ప్రయత్నిస్తుందని సమాచారం. ఆ తర్వాతే అతనితో ప్రేమలో పడి అతనితో పాటు క్రైమ్ చేస్తూ ఉంటుందని సమాచారం.