టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన శృతిహాసన్ గడిచిన కొద్ది సంవత్సరాల క్రితం సినిమాలకు దూరంగా ఉంటోంది. క్రాక్ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి తన హవా కొనసాగిస్తోంది శృతిహాసన్. ఇక తాజాగా సంక్రాంతికి చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమాలలో నటించి మళ్లీ తన హవా పుంజుకునేలా చేస్తోంది. గడిచిన కొద్దిరోజుల క్రితం నుంచి శృతిహాసన్ ఒక వ్యాధి బారిన పడిందని వార్తలు వైరల్ గా మారుతున్నాయి.అయితే ఈ వార్తల పైన రియాక్ట్ అవుతూ శృతిహాసన్ స్పందించినట్లుగా తెలుస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం.
శృతిహాసన్ మాట్లాడుతూ తనకు ఎలాంటి మానసిక సమస్యలు లేవని సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నట్లుగా తెలియజేసింది.తాను మనోవ్యాధితో బాధపడుతున్నట్లు సాగుతున్న దుష్ప్రచారంపైన ఆమె స్పందించడం జరిగింది. శృతిహాసన్ నటించిన రెండు చిత్రాలు ఈ సంక్రాంతికి విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే కలెక్షన్ల పరంగా కూడా పలు రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. అయితే ఈ సినిమా విడుదలకు ముందు నిర్వహించిన ప్రమోషన్లలో భాగంగా ఆమె ఒక సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు హాజరై మరొక సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు హాజరు కాలేదు కూడా వినిపించాయి.
ఈ సందర్భంగా శృతిహాసన్ మాట్లాడుతూ తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నానంటూ సోషల్ మీడియాలో సాగుతున్న పుకార్లకు చెక్ పెట్టేది. వీరసింహారెడ్డి సినిమా ఈవెంట్ ఒంగోలులో నిర్వహించారు వైజాగ్లో నిర్వహించిన వాల్తేర్ వీరయ్యే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాలేదు. కేవలం వైరల్ ఫీవర్ ద్వారానే హాజరు కాలేకపోయినట్లు తెలియజేసింది. కానీ కొంతమంది మాత్రం ఈ విషయాన్ని మరొక లాగా అర్థం చేసుకున్నారని శృతిహాసన్ మనో వ్యాధితో బాధపడుతున్నట్లుగా ప్రచారం చేశారని ఆమె స్క్రీన్ షాట్ తీసి తన ఆరోగ్యం సంపూర్ణంగా ఉన్నట్లుగా తెలియజేసింది.