ప్రముఖ యంగ్ కన్నడ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శ్రీకాంత్ నటించిన పెళ్లి సందడి సినిమా ను రీమేక్ చేస్తూ ఆయన తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కించిన చిత్రం పెళ్ళిసందD. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సొంతం చేసుకొని ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం 10 చిత్రాలకు పైగా ఈమె చేతిలో ఉన్నాయి.
పాత్రల ఎంపిక విషయంలో, కథలో ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ తెలివిగా వ్యవహరిస్తున్న శ్రీ లీల అంతకుమించి క్రేజ్ ను సొంతం చేసుకుంటుందని చెప్పవచ్చు. ఇక తాజాగా ఈమె బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాలో నటించింది. మరొక పక్క మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో కూడా నటిస్తోంది. ఇవే కాకుండా చాలామంది యంగ్ హీరోలు, సీనియర్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ మరింత బిజీగా మారిపోయింది . ఇదిలా ఉండగా తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన ఒక వార్త నెట్టింట చాలా వైరల్ గా మారింది.
రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించడానికి ఈమెను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఇక అసలు విషయంలోకి వెళితే ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరొకవైపు సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేస్తుండగా.. అందులో ఈమెను ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు రూ.1కోటి , రూ .2కోట్లకే తన పారితోషకాన్ని పరిమితం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా కోసం ఏకంగా రూ.5కోట్లు డిమాండ్ చేస్తుందట. ఇకపోతే ఇది కొంతమందికి ఆశ్చర్యాన్ని కలిగించినా..ఈమె క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈమె అడిగినంత పారితోషకం ఇచ్చిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అని చెప్పవచ్చు.