సాహూ లోతన పాత్ర పై శ్రద్ధ కపూర్ షాకింగ్ కామెంట్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సాహో. యువి క్రియేషన్స్ వారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. సినిమాలో హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ నటిస్తుందని తెలిసిందే. జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ అవుతుంది.

సినిమా గురించి టీజర్ లో కొద్దిగా రివీల్ అవగా హీరోయిన్ శ్రద్ధా కపూర్ మరికొంత సమాచారం అందించింది. సినిమాలో శ్రద్ధా కపూర్ పోలీస్ పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది. సినిమా మొత్తం ఆమె చేతిలో గన్ ఉంటుందట. అందుకే ఆ సినిమా వల్ల గన్ తో ప్రేమలో పడ్డానని.. అది ఇప్పుడు శరీరంలో ఒక భాగమైందనిపిస్తుందని చెప్పుకొచ్చింది. సాహో సినిమాలో నటించడం తన అదృష్టమని భావిస్తుంది శ్రద్ధా కపూర్.

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాపై తారాస్థాయిలో అంచనాలున్నాయి. టీజర్ చూస్తే కచ్చితంగా సాహో ఆ అంచనాలకు తగినట్టుగా ఉంటుందని చెప్పొచ్చు. సాహో తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచేలా ఉంటుందని తెలుస్తుంది. మరి ఆగష్టు 15న ప్రభాస్ సాహో సందడి ఎలా ఉంటుందో చూడాలి.

Share.