సీనియర్ హీరోల రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈ మధ్య టాలీవుడ్లో స్టార్ హీరోలు సైతం రెమ్యూనరేషన్ విషయంలో అంచనాలను మించి పెంచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మార్కెట్ కు అనుగుణంగా రెమ్యూనరేషన్ పెంచడంలో ఎలాంటి తప్పు లేదని కూడా హీరోలు సైతం భావిస్తున్నారు.హీరోలు ఒక్కొక్క చిత్రానికి దాదాపుగా రూ.80 కోట్ల పై మాటే తీసుకుంటున్నారు సీనియర్ స్టార్ హీరోలు సైతం తమ సినిమా కలెక్షన్లకు అనుగుణంగా రెమ్యూనికేషన్ తీసుకుంటూ ఉన్నారు టాలీవుడ్లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.

Chiranjeevi Balakrishna Nagarjuna Venkatesh: ఈ ఫార్ములాతో బాక్సాఫీస్‌ను  రఫ్పాడించిన చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్.. | Chiranjeevi  Nagarjuna Venkatesh Balakrishna Done Movies ...

ఈ సినిమాకి గాను దాదాపుగా రూ.40 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యున రేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక గత రెండు సినిమాలు చిరంజీవి ఇదే స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. స్టార్ హీరో బాలకృష్ణ విషయానికి వస్తే.. బాలయ్య ఒక్కో చిత్రానికి ప్రస్తుతం రూ.18 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక మరొక హీరో వెంకటేష్ కూడా ఒక చిత్రానికి రూ.12 కోట్ల రూపాయలకు పైగా అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక నాగార్జున మాత్రం ఒక్కో చిత్రానికి రూ .10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ హీరో రవితేజ కూడా ఒక చిత్రానికి రూ .20 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఇతర హీరోలు సైతం వారి యొక్క సినిమాల కలెక్షన్లను బట్టి రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక స్టార్ హీరోల రేమ్యూనరేషన్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో స్టార్స్ కు ప్రతిరోజు క్రేజీ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదని చెప్పవచ్చు.

Share.