పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాల తో బిజీగా ఉంటూనే మరొకవైపు రాజకీయాలలో కూడా తన హవా కొనసాగించాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత సినిమాలతో బిజీగా మారిపోయారు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్
ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నది.ఈ సినిమా పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో పవన్ ఒక బందిపోటుగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాతో పాటు రీసెంట్ గా డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమాని చేయబోతున్నారు. ప్రభాస్తో తెరకెక్కించిన సాహో సినిమాతో బాగా అలరించిన సుజిత్ పవన్ తో సినిమా చేస్తుండడంతో భారీ అంచనాలు పెరిగిపోయాయి నిన్నటి రోజున పవన్ సుజిత్ సినిమాని ప్రారంభోత్సవం చాలా గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకుడు తమన్ కూడా హాజరయ్యారు.
ఈ సినిమా నిర్మాత దానయ్యతో పాటు అల్లు అరవింద్ దిల్రాజు సురేష్ బాబు కూడా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ బ్లాక్ కలర్ డ్రెస్సులో చాలా స్టైలిష్ గా హాజరైనట్లు కనిపిస్తోంది.ఈ సందర్భంగా పవన్ పెట్టుకున్న వాచి గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ధరించిన వాచి పనే రామ్ అనే ప్రముఖ బ్రాండెడ్ కంపెనీకి చెందినది. దీని ధర దాదాపుగా రూ.13.5 లక్షల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం విన్న అభిమానులు సినీ ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.