సినీ ఇండస్ట్రీలో ఒకటి రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించి భారీ పాపులారిటీ అందుకున్న తర్వాత ఉన్నట్టుండి ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు.. ఆ తర్వాత వారు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? అనే విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సరసన నటించి ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఏం చేస్తుంది ?అనే విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు చూపిస్తున్నారు.
అసలు విషయంలోకెళితే 2005లో వచ్చిన బాలు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు శ్రీయ, నేహా ఒబెరాయ్. డైరెక్టర్ కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్ కి అభిమానులు పూర్తిస్థాయిలో ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఈ సినిమా కమర్షియల్ హిట్ గా నిలవకపోయినా అభిమానులలో ప్రేక్షకులలో ఈమెకు గుర్తింపు ఇచ్చింది ఈ సినిమా అని చెప్పవచ్చు.
ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన స్టైల్ , ఆటిట్యూడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ఇకపోతే ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే ప్రేక్షకులను బాగా అలరించిన నేహా ఒబెరాయ్ గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరూ సెర్చ్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమా బాలు తర్వాత జగపతిబాబుతో బ్రహ్మాస్త్రం సినిమాలో నటించిన ఈమె ఆ తర్వాత హిందీలో నటించింది. 2009 తర్వాత సినిమాలకు దూరం అయింది. ఆ తర్వాత 2010లో విశాల్ షా అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకొని సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి ఇప్పుడు వ్యాపారాలు చూసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు ఈ అమ్మడి ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఈ నేపథ్యంలోని ఈమె గురించి ప్రతి ఒక్కరు వెతకడం మొదలుపెట్టారు.