బుల్లితెర యాంకర్ లలో నెంబర్ వన్ యాంకర్ గా సత్తా చాటుతున్న శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఆమె గ్లామర్ తో అలాగే యాక్టింగ్ తో యాక్టివ్గా ఉంటూ బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది. ఈమె యాంకర్ గానే కాకుండా పలు సినిమాలలో నటించి వెండితెరపై కూడా గుర్తింపు పొందింది. ఆ తరువాత బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టి రన్నర్ గా నిలిచింది.
అయితే ఈ మధ్యకాలంలో శ్రీముఖి కొన్ని వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కొంతకాలంగా శ్రీముఖి పెళ్లికి సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ మారుతున్నాయి.. ఈ క్రమంలోనే దీని గురించి చాలా పుకార్లు కూడా వినిపిస్తున్నాయి… తాజగా సరిగమ అనే షోలో సింగర్ సాయి శ్రీ చరణ్ తో లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చింది. ఇదంతా టిఆర్పి కోసమే చేస్తున్న వీళ్ళ జంట బాగానే హైలెట్ అయింది.
ప్రస్తుతం జీ తెలుగులో సరిగమప ఛాంపియన్షిప్ సీజన్ నడుస్తోంది. ఇందులో పాత కంటెస్టెంట్లు కూడా వచ్చారు. వారిలో సాయి శ్రీ కూడా ఉన్నారు. ఫేస్ ఆఫ్ ఛాలెంజ్ లో భాగంగా అతడు తాళికట్టు శుభవేళ అనే పాటను ఆలపించాడు. అతని పాటపై అందరూ ప్రశంసలు కురిపించారు.. అయితే అప్పుడే శ్రీముఖి ఫోన్ చేసి ప్రదీప్ ఇవ్వగా..చరణ్ కు ఇచ్చాడు. ఆ వెంటనే అతడు జలజలపాతం నువ్వు శ్రీ చరణ్ పాడిన తర్వాత శ్రీముఖి నాకు పాడాలని ఉంది. కానీ జలుబు చేసింది. అని చెప్పింది.
ఆ తర్వాత చరణ్ ఎలా ఉన్నారండి అన్నాడు. దానికి శ్రీముఖి సడన్గా రెస్పెక్ట్ ఇస్తున్నావేంటి? మామయ్య గారు వచ్చారా షూటింగ్ కు అని మాట్లాడింది. దీంతో అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. అలా శ్రీముఖి బుక్ అవ్వడంతో ఇతడితో ప్రేమలో పడిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం శ్రీముఖి వరుస షో లతోబిజీగా గడిపేస్తుంది. అందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారుతోంది.