ఏ సిని ఇండస్ట్రీలోనైనా సరే సెలబ్రెటీల గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్తలు వినిపిస్తూ ఉంటాయి. సెలబ్రెటీలు ఇద్దరు కలిసి ఎక్కడ కనిపించిన పలు చిత్రాలలో నటించిన వారి గురించి పలు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అలా ఇప్పటివరకు ఎంతోమంది నటీనటుల గురించి ఈ వార్తలు వినిపించాయి.. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి అక్కినేని హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ఇద్దరు కలిసి డేటింగ్ లో ఉన్నారని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా త్వరలోనే వీరు ఇద్దరు వివాహం చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ కలిసి లండన్లో ఒక రెస్టారెంట్లో కనిపించడం జరిగింది. దీంతో ఈ వార్తలు నిజమేనని అందరూ భావించారు. ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా శోభిత ఈ విషయంపై స్పందించడం జరిగింది.. శోభిత మాట్లాడుతూ నేను ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాను తాజాగా మణిరత్నం గారి దర్శకత్వంలో వచ్చిన అద్భుతమైన సినిమాలు నటించాను ఆ అనుభూతి నాకు చాలా బాగుంది అంటూ తెలుపుతోంది.. నాకు ఇంత మధుర జ్ఞాపకాలు ఉన్నప్పుడు ఎవరు ఏదో అన్నారని ఆ విషయాలను పట్టించుకోని ఫీలవ్వాల్సిన పనిలేదంటూ తెలుపుతోంది.
తన గురించి వచ్చే రూమర్స్ విషయంలో ఎలాంటి తప్పు లేనప్పుడు నేనేందుకు అంత అర్జెంటుగా ఫీల్ అయ్యి వాటిపై రియాక్ట్ అవ్వాలి అంటూ తెలిపింది.. నేను ఎందుకు కంగారు పడాలి అందుకే నా పనిలో నేను బిజీగా ఉన్నాను అంటూ ఈ సందర్భంగా తెలిపింది శోభిత. దీంతో గట్టకేలకు నాగచైతన్యత వస్తున్న డేటింగ్ రూమర్ల పైన క్లారిటీ వచ్చిందని చెప్పవచ్చు ఇప్పటికైనా వీరిద్దరి గురించి వచ్చే రూమర్స్ ఆగుతాయేమో చూడాలి మరి. ప్రస్తుతం ఇద్దరు ఎవరు సినిమాలలో వారు బిజీగా ఉంటూ ఉన్నారు నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా ఈ నెల 12వ తేదీన విడుదల కాబోతోంది.