తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరో హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన వారిలో రాజశేఖర్ ,జీవిత కూడా ఒకరు. అప్పట్లో వీరిద్దరూ స్టార్స్ గా పేరు సంపాదించారు. వివాహమైన తర్వాత కూడా ఇద్దరూ కలిసి పలు సినిమాలను నటించారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు కూడా జన్మించారు.అందులో ఒకరు శివాత్మిక మరొకరు, శివాని రాజశేఖర్ వీరిద్దరూ ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్నారు.
2019లో విడుదలైన దొరసాని సినిమా ద్వారా శివాత్మిక తెలుగు తెరకు పరిచయమైంది..తన తొలి చిత్రంతోనే పరవాలేదు అనిపించుకుంది. ఈ సినిమా తర్వాత శివాత్మికకు పలు సినిమాలలో నటించిన అవకాశాలు అందుకోలేక పోతోంది. అయినా కూడా ఈమెకు అవకాశాలు ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. అప్పుడప్పుడు బుల్లితెరపై కూడా తన కుటుంబంతో కలిసి పాల్గొంటూ సందడి చేస్తూ ఉంటుంది.
శివాత్మిక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గానే ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్ ని షేర్ చేస్తూ ఉంటున్న శివాత్మిక మొదటిలో చాలా పద్ధతిగా కనిపించేది.ఏ ఈవెంట్ లో పాల్గొన్న మంచి మంచి దుస్తులలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేది.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలంటే గ్లామర్ షో చేయడం తప్పదనే విషయాన్ని తెలుసుకున్నట్టు ఉంది. అందుకే ఇప్పుడు పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తన అందాలను బయటపెడుతూ అందరికీ షాక్ ఇస్తోంది.
ఇదే గ్లామర్ షో చేయడంలో రాజశేఖర్ అభిమానులు అసలు తట్టుకోలేకపోతున్నారు. పెద్ద కూతురు శివాని కూడా ఇలాంటివే ఫాలో అవుతూ ఉంది. ఇలాంటి గ్లామర్ షో చేయడంతో మీ తల్లితండ్రుల పరువు తీస్తున్నారు అంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఇంస్టాగ్రామ్ లో శివాత్మిక ఒక వీడియోని పంచుకుంది..ఇందులో తన కారులో ప్రయాణిస్తున్న వీడియోలు మరికొన్ని వీడియోలను కలిపి పంచుకుంది. ఆ వీడియోకు చందమామతో ఎఫైర్ అంటూ క్యాప్షన్ పంచుకుంది. దీంతో కొంతమంది ఆ క్యాప్షన్ చూసి చందమామ ఎందుకు మేమున్నాము కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.