టాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈయన 10 భాషలలో కొరియోగ్రాఫర్ గా పనిచేశాడు. అంతేకాకుండా పలు డాన్స్ షో లకు కూడా జడ్జిగా పనిచేశారు. మగధీర సినిమాలో ధీర ధీర సాంగ్ కు కొరియోగ్రాఫర్ గా పని చేశారు. అయితే తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా దీన స్థితిలో ఉన్నట్లుగా సమాచారం. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.
శివ శంకర్ మాస్టర్ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో హైదరాబాదులోని ప్రముఖ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని సమాచారం. శివ శంకర్ మాస్టర్ కుమారుడు తప్ప ఆయన కుటుంబ సభ్యులంతా కరోనా బారిన పడ్డారని తెలుస్తోంది. వైద్యం కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుండడంతో.. ఆ మొత్తాన్ని కుటుంబ సభ్యులు చెల్లించడంలో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు గా తెలుస్తోంది.
సినీ ఇండస్ట్రీ నుంచి ఆర్థిక సాయం అందుతుందని శివ శంకర్ మాస్టర్ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. శివ శంకర్ మాస్టర్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.