ఒకప్పుడు సీనియర్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించిన హీరో శివాజీ ప్రతి ఒక్కరికి సుపరిచితమై.. ఫ్యామిలీ సినిమాలలో లవ్ చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించారు. ప్రస్తుతం బిగ్బాస్ హౌస్లో కంటిస్టెంట్ గా ఉంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు.. బిగ్బాస్ హౌస్ నుంచి చాలామంది ఎలిమినేట్ అయ్యి వెళుతూ ఉండగా శివాజీ మాత్రం టాప్ పొజిషన్ లో కొనసాగుతూ ఉన్నారు.. 2004వ సంవత్సరంలో చిరంజీవి బర్త్డే సందర్భంగా ఒక ఈవెంట్లో శివాజీ చిరంజీవి గురించి పలు విషయాలను మాట్లాడడం జరిగింది.
చిరంజీవి స్వయంకృషి వల్లే ఎదిగాడంటూ పొగడ్తలతో ముంచేయడంతో.. ఆ సమయంలో చిరంజీవి కూడా శివాజీకి తన సినిమాలు మంచి అవకాశం ఇస్తూ వచ్చారు. అలా శివాజీ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. మధ్యలో కొన్ని సంవత్సరాలు రెస్ట్ తీసుకుని పొలిటికల్ పరంగా బిజీగా ఉండేవారు.. శివాజీ చాలా రోజుల తర్వాత బిగ్బాస్ షో ద్వారా కనిపించడం జరిగింది. శివాజీ మీద కొంతమంది నెగటివ్ కామెంట్స్ చేయడం జరుగుతుంది ఒకప్పుడు తన ఎదుగుదల కోసం చిరంజీవిని ఉపయోగించుకున్నారని ఆ తర్వాత చిరంజీవి మీదనే చాలా కామెంట్స్ చేశారంటూ తెలుపుతున్నారు.
శివాజీ చాలా స్వార్థపరుడు అంటూ మరికొంతమంది తెలుపుతూ ఉండగా బిగ్ బాస్-7 లో టైటిల్ విన్నర్గా శివాజీ గెలుస్తారా లేదా అనే విషయం ఇప్పుడు అభిమానులలో చాలా ఆసక్తిని కలిగిస్తోంది. వాస్తవానికి చిరంజీవి లాంటి ఒక స్టార్ హీరో సపోర్టు వల్లి ఇండస్ట్రీలోకి వచ్చిన శివాజీ చిరంజీవి మీదనే కామెంట్స్ చేయడం చాలా బాధాకరమైన విషయమని అభిమానులు తెలుపుతున్నారు.
గతంలో కూడా టిడిపి పార్టీ తరపున ఎన్నో విషయాలను మాట్లాడడం జరిగింది శివాజీ.. ఆ తర్వాత పొలిటికల్ గా సైలెంట్ అయ్యి మళ్లీ బిగ్ బాస్ లో కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఇప్పుడు కూడా వెబ్ సిరీస్ లో నటిస్తున్న శివాజీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి పొలిటికల్ పరంగా పూర్తిగా దూరమైనట్టేనా అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.