దివంగత నటుడు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి నేటికి నెల రోజులు అయ్యింది. ఆయన మరణించాడు అన్న వార్తను అభిమానులు, కుటుంబ సభ్యులు ఇప్పటికే జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరణించి నెల రోజులు అవుతున్నా కూడా అతని సమాధిని చూడటానికి అభిమానులు సన్నిహితులు క్యూ కడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న పునీత్ అన్న శివ రాజ్ కుమార్ తమ్ముడు మరణాన్ని తలచుకుని ఎమోషనల్ అయ్యారు.
పునీత్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే పునీత్ మరణాన్ని ఇప్పటికీ నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. అప్పు ఇంకా నా పక్కనే ఉన్నట్లు అనిపిస్తోంది. శివన్నా అని ప్రేమగా పిలుస్తున్న గొంతు వినిపిస్తోంది. పులి చనిపోయి నెల రోజులు ఎలా గడిచాయో కూడా అర్థం కావడం లేదు అని తెలిపారు. అలాగే ఆ బాధ నుంచి బయట పడేందుకు సినిమాల వైపు దృష్టి పెడుతున్నాను అని చెప్పుకొచ్చారు. అప్పటికీ ఎక్కడికి వెళ్ళినా పూలదండలతో పునీత్ ఫోటో కనిపిస్తున్నాయి. వాడిని చూసిన ప్రతిసారి కన్నీళ్ళు ఉబికి వస్తున్నాయి అని తెలిపారు.