తెలుగు సినీ ఇండస్ట్రీలో శుభలగ్నం, శుభసంకల్పం, మావిచిగురు తదితర సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచకుంది హీరోయిన్ ఆమని. కె విశ్వనాథ్ తో సహా ఎంతోమంది దిగ్గజ దర్శకులతో పనిచేసిన ఆమని పరిశ్రమలో అగ్ర హీరోయిన్గా పేరు సంపాదించింది దశాబ్ద కెరియర్లో అగ్ర హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. తెలుగు సినీ పరిశ్రమ ఆమని విపరీతమైన ఫ్యామిలీ ఆడియన్స్ను సంపాదించుకుంది. అంత గొప్ప ప్రతిభవని ఇటీవల కాలంలో టాలీవుడ్ లో మళ్లీ కం బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఆమని బాగానే అవకాశాలు అందుకుంటోంది. మరొకవైపు టీవీ షో లలో హోస్టుగా వ్యవహరిస్తూ ఉన్నది ఆమని. ఇక తన పర్ఫామెన్స్ తో కూడా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఆమని తాజాగా ఆమెని కెరియర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులను తాజాగా ఒక ఇంటర్వ్యూలో రివిల్ చేయడం జరిగింది. కెరియర్ ఆరంభంలో సినిమా అవకాశాల కోసం తాను ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగానని.. అలాంటప్పుడే పలు రకాల పరిస్థితులను చూశానని నేను బయటికి ఎక్కడికి వెళ్లినా తన వెంట తన తల్లి కూడా ఉండేదని తెలిపింది.
ఇక అలా తన తల్లితోపాటు ఆఫీసుల్లోకి వెళ్లడం కొందరికి నచ్చేది కాదట అమ్మ లేకుండానే ఆఫీస్ కు ఒంటరిగా రమ్మని చెప్పే వాళ్ళని తెలిపింది. నేను కూడా అంతే దీటుగా సమాధానం ఇచ్చేదానిని అంటూ తెలిపింది ఆమని. ఇక ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారనేది తెలియడానికి కొంత సమయం పట్టింది.అప్పుడే తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.. ఆయన మొదటి నుంచి సినిమాల వైపు వెళ్లొద్దని చెప్పేవారు.. ఎక్కువగా చెల్లె పాత్రలు కూతురు పాత్రలు మాత్రమే ఆఫర్ చేసేవారు. అలాంటి సమయంలోనే హీరోయిన్ గా ఎదగడం కోసం రెండేళ్లు సమయం పట్టిందని తెలిపింది.