అల్లు అర్జున్ కి ఇష్టం లేని ఏకైక హీరోయిన్ ఆమె..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో ఉత్తమ నటుడిగా గుర్తింపు పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. పుష్ప సినిమాలో పుష్పరాజ్ పాత్రతో తన నటనకి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. ఈ విషయం తెలిసిన సెలబ్రిటీలందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్పటికీ 69 సంవత్సరాలైనా ఏ అగ్ర హీరో కూడా సాధించలేని ఘనత కేవలం ఇండస్ట్రీకి వచ్చిన 20 సంవత్సరాలలోపే సాధించాడు అల్లు అర్జున్.. ఇలా మొదటిసారి అల్లు అర్జున్ ఈ అవార్డు రావడంతో ఆయన అభిమానులు ఎంతగానో ఆనందిస్తున్నారు. అయితే అలాంటి అల్లు అర్జున్ కొన్ని ఇంటర్వ్యూలో అప్పుడప్పుడు పాల్గొంటూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియ చేస్తూ ఉంటారు.

Allu Arjun, Anu Emmanuel's Naa Peru Surya, Naa Illu India movie stills -  Photos,Images,Gallery - 88052

ఇందులో భాగంగానే తనకు ఇష్టం లేని హీరోయిన్ గురించి ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో హీరోయిన్ గా అనుఇమ్మానుయేల్ నటించింది. అంతేకాకుండా ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ అంటే తనకు అసలు ఇష్టం లేదని ఓ ఇంటర్వ్యూలో పేరును ప్రస్తావించకుండా బయటపెట్టారు.

అయితే ఆ ఇంటర్వ్యూ చూసిన జనాలందరూ అనుఇమ్మానియేలే ఆని గుర్తుపట్టేశారు.. ఈ సినిమాలో నటించే టైంలో అనుఇమ్మానియేల్ తో, అర్జున్ కి చాలా ఇబ్బంది ఏర్పడిందట. అయితే ఈ హీరోయిన్ అంటే అల్లు అర్జున్ కి అలాగే అల్లు అర్జున్ అభిమానులకి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో థియేటర్లకు వెళ్లి చూసిన అభిమానులంతా మీడియాతో ఈ విషయాన్ని పంచుకున్నారు. అంతేకాకుండా తనతో మళ్ళీ అవకాశం వచ్చినా కూడా అల్లు అర్జున్ రిజెక్ట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక అల్లు శిరీష్ తో కూడా ఈమె ప్రేమాయణం కొనసాగిస్తోందని వార్తలు వినిపించాయి.

Share.